Advertisementt

అప్పుడు శృతి హాసన్.. ఇప్పుడు తమన్నా

Sat 03rd Jun 2023 09:54 AM
tamannaah  అప్పుడు శృతి హాసన్.. ఇప్పుడు తమన్నా
Then Shruti Haasan.. Now Tamannaah అప్పుడు శృతి హాసన్.. ఇప్పుడు తమన్నా
Advertisement
Ads by CJ

కొంతమంది హీరోయిన్స్ తాము రెండుమూడు ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా కనిపిస్తారు. ఆ రెండుమూడు ప్రాజెక్ట్స్ ఒకేసారి అంటే దాదాపు ఒకే తేదీల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి హీరోయిన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తే.. ప్రేక్షకులకి క్రేజీగా ఉంటాయి. ఈమధ్యన శృతి హాసన్ నటించిన వీరసింహరెడ్డి, వాల్తేర్ వీరయ్య ఫిలిమ్స్ అలానే సంక్రాంతి బరిలో పోటీపడ్డాయి. జనవరి 12 న వీరసింహ రెడ్డి, జనవరి 13న వాల్తేర్ వీరయ్య రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలలో నటించిన శృతి హాసన్ రేర్ ఫీట్ సాధించింది. ఆ రెండు సినిమాలు ఆమెకి సక్సెస్ ని తెచ్చిపెట్టాయి.

ఇపుడు అదే రేర్ ఫీట్ తమన్నా కూడా సాధించబోతుంది. ఆగష్టు 10న తమన్నా సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించిన జైలర్ మూవీ రిలీజ్ అవుతుండగా.. ఆగష్టు 11 న మెగాస్టార్ తో నటించిన భోళా శంకర్ విడుదలవ్వుతుంది. మెగాస్టార్-సూపర్ స్టార్ సినిమాల్లో నటిస్తున్న తమన్నా ఆ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్ తోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దానితో ఇప్పుడు తమన్నా కి రెండు సక్సెస్ లు వస్తాయా.. లేదా అనేది సస్పెన్స్ గా మారితే..

ఆమె నటిస్తున్న రెండు సినిమాల షూటింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ షూటింగ్ ఫినిష్ చేసి కేక్ కట్ చేసాడు. ఇక మెహెర్ రమేష్ కూడా భోళా శంకర్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉండగానే.. ప్రమోషన్స్ మొదలు పెట్టేసాడు. 

Then Shruti Haasan.. Now Tamannaah:

Tamannaah is about to achieve a rare feat

Tags:   TAMANNAAH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ