టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ హీరోయిన్ కి లేని క్రేజు, ఏ హీరోయిన్ కి లేని బిజికి కేరాఫ్ గా శ్రీలీల కనిపిస్తుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన శ్రీలీల ప్రస్తుతం స్టార్ అండ్ యంగ్ హీరోల ఛాన్సెస్ తో అదరగొట్టేస్తుంది. ఒకటా రెండా ఏకంగా తొమ్మిది ప్రాజెక్ట్స్ తో శ్రీలీల డైరీ ఫుల్లయ్యింది. ఈ ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు పక్కాగా విడుదల కాబోతున్నాయి. ధమాకా జోష్ తర్వాత శ్రీలీల డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే తాజాగా సీనియర్ హీరోలు, యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు.. ఏమైనా తేడా కానీ, లేదంటే ప్రత్యేకమైన ముద్ర పడుతుంది అని భావిస్తున్నారా అని అడిగితే దానికి శ్రీలీల సూపర్బ్ ఆన్సర్ ఇచ్చింది.
సీనియర్స్ తో ఒకలా, యంగ్ హీరోలతో నటిస్తే ఒకలా ఇమేజ్ ఉంటుంది అనే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రేక్షలులు ఇప్పుడలా ఆలోచించడం లేదు. చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. సినిమా అనేది క్రియేట్ చేసిన కథ. తెరపైకి తీసుకురావడానికి అందుకు తగ్గ పాత్రలకు సరిపోయే వాళ్లనే తీసుకుంటారు. మనం చేస్తున్న పాత్రకి మనం 100 శాతం న్యాయం చేశామా, లేదా అనేదే ప్రేక్షకులు చూస్తున్నారు.
అంతేకాని.. మీ పక్కన ఉన్నది స్టార్ హీరోనా, కుర్ర హీరోనా అనేది పట్టించుకోరు. ఆర్టిస్ట్ లకి కూడా అలాంటి ఆలోచన ఉండదు, వయసు అనేది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అంటూ శ్రీలీల అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.