Advertisementt

పవన్ డైరీ చూసి కూడా ఆ మాటంటారా?

Fri 02nd Jun 2023 09:49 PM
ambati,pawan kalyan  పవన్ డైరీ చూసి కూడా ఆ మాటంటారా?
Did you say that after seeing Pawan diary? పవన్ డైరీ చూసి కూడా ఆ మాటంటారా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఎప్పుడో రాజకీయాల్లో భాగంగా ప్రజల్లోకి వెళ్లి జనసేన సిద్ధాంతాలని తెలియజేయాలనే ప్లాన్ లో భాగంగా వారాహి యాత్రకి శ్రీకారం చుట్టారు. దాని కోసం ఓ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ వాహనానికి వారహిగా నామకరణం చేసిన పవన్ కళ్యాణ్ దానికి పూజలు నిర్వహించారు. తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి యాత్రని పక్కనబెట్టి సినిమా షూటింగ్స్ అంటూ ప్రొఫెషనల్ గా బిజీ అయ్యారు. 

తాజాగా ఈ నెల 14 నుంచి వారాహిలో పవన్‌ కల్యాణ్ ప్రచారం మొదలు పెట్టబోతున్నారంటూ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమం రూపకల్పన చెయ్యడం.. యాత్రలో భాగంగా వివిధ వర్గాలను పవన్ కళాబోతున్నట్లుగా మనోహర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ యాత్రని అలా ప్రకటించారో లేదో.. ఇలా వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు రంగంలోకి దిగిపోయి పవన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వారు పవన్ యాత్ర ఎక్కడ సక్సెసవుతుందో అన్న ఉద్దేశ్యంతో పవన్ పై విరుచుకుపడుతున్నారు. అంబటి రాంబాబు అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లేకనే యాత్ర మొదలు పెడుతున్నాడంటూ వ్యగ్యంగా కామెంట్స్ చేసారు. మరి అంబటి రాంబాబుకి పవన్ కళ్యాణ్ వరస లైనప్ గురించి అవగాహన లేక అలా మాట్లాడుతున్నారేమో అని పవన్ ఫాన్స్ ఫైరవుతున్నారు. 

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో, OG, హరి హరవీరమల్లు మూవీస్ సెట్స్ మీదున్నాయి. అంటే కాదు పవన్ ఊ అనాలే కానీ.. ఆయనతో సినిమాలు చేసేందుకు చాలామంది నిర్మాతలు రెడీగా ఉన్నారు. నాలుగు సినిమాల షూటింగ్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ బిజీగా వుంటున్నారు. ఇప్పుడు ప్రజల కోసం వారాహి యాత్ర చేపట్టారు. అంబటి రాంబాబు గారికి ఆయన చేసే పని తప్ప ఇతరుల గురించి అంతగా తెలియక మాట్లాడుతున్నారు పాపం అంబటి అంటూ పవన్ ఫాన్స్ అంబటి రాంబాబుని ఆడేసుకుంటున్నారు. 

Did you say that after seeing Pawan diary?:

Ambati satirical comments on Pawan Kalyan varahi Yatra

Tags:   AMBATI, PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ