సమంత హీరోయిన్ గా ఓ స్టేజ్ కి చేరుకున్నాక ఫిట్ నెస్ కోసం తరచూ జిమ్ చేస్తూ ఆ జిమ్ ఫొటోస్, వీడియోస్ తో హడావిడి చేస్తూ వస్తుంది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా సమంత ఫిట్ నెస్ కోసం జిమ్ చేసింది. అయితే తనకు కాస్త కోపమొచ్చినా, లేదంటే కాస్త అసహనంగా ఉన్నా ఎక్కువగా జిమ్ చేస్తా అంటూ ఒకొనొక సందర్భంలో చెప్పుకొచ్చింది. ఒక్కోసారి సమంత సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తుందా అనిపించేలా బాడీని తయారు చేసింది.
అయితే గత ఏడాది మాయోసైటిస్ సమంతని బాగా ఇబ్బంది పెట్టింది. దానితో ఆమె జిమ్ కూడా పక్కనబెట్టేసింది. కొద్దిరోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకుని మళ్ళీ షూటింగ్స్ అంటూ బిజీ అయ్యింది. జిమ్ కూడా మొదలెట్టేసింది. శాకుంతలం డిసాస్టర్ తర్వాత సిటాడెల్, ఖుషి షూటింగ్స్ చేస్తున్న సమంత తాజాగా జిమ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో సమంత కండలు చూపిస్తుంది. తన జిమ్ ట్రైనర్ తో పాటు సమంత ఈ ఫోటోకి నవ్వుతూ ఫోజులిచ్చింది.
నవ్వుతూ కనిపించిన సమంతని చూస్తే నిజంగా చాలా క్యూట్ ఉంది అనేస్తారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత టర్కీలో ఉన్నారు. టర్కీలో కొత్త షెడ్యూల్ జరుగుతోంది. అక్కడ షూట్ గ్యాప్ లో విజయ్ తో కలిసి లంచ్ కి వెళ్లిన ఫోటోని షేర్ చెయ్యగా అది నిమిషాల్లో వైరలయ్యింది.