Advertisementt

రాజమౌళి రికార్డులని ప్రాజెక్ట్ K చెరిపేస్తుంది

Fri 02nd Jun 2023 12:27 PM
rana,project k  రాజమౌళి రికార్డులని ప్రాజెక్ట్ K చెరిపేస్తుంది
Project K erases Rajamouli records రాజమౌళి రికార్డులని ప్రాజెక్ట్ K చెరిపేస్తుంది
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ప్యాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ప్రాజెక్ట్ K చిత్రంపై ఉన్న అంచనాలు ప్రెజెంట్ తెరకెక్కుతున్న ఏ భారీ చిత్రంపై లేవనే చెప్పుకునేలా ఉన్నాయి. హీరోయిన్ దీపికా పదుకొనే, అమితాబచ్చన్ లాంటి స్టార్ నటులు భాగమయిన ప్రాజెక్టు K వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్, భారీగా తెరకెక్కుతున్న ఈచిత్రంపై ఇప్పుడు దగ్గుబాటి హీరో మరింతగా పెంచేశారు. రానా తమ్ముడు అహింసాతో వెండితెరకు హీరోగా పరిచయమవడం, అలాగే పరేషాన్ చిత్రం ప్రమోషన్స్ లో కనిపించిన రానా ప్రాజెక్ట్ K పై ప్రత్యేకంగా మాట్లాడి అంచనాలు పెంచేసాడు.

తెలుగు ప్రేక్షకులంతా ప్రాజెక్ట్ K కోసం ఎదురు చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ప్రాజెక్ట్ K ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటివరకు ఉన్న బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ రికార్డులని ప్రాజెక్ట్ K తుడిచేస్తుంది అంటూ హాట్ కామెంట్స్ చేసారు. ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నేనైతే ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. ప్రాజెక్ట్ K పై నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఇప్పుడు ఒక హీరో మరో హీరో సినిమాని సపోర్ట్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారంటూ రానా మాట్లాడాడు.

రికార్డులకు నెలవుగా మారిన బాహుబలిలో ప్రభాస్ తో పాటుగా రానా కూడా భళ్లాలదేవునిగా విశ్వరూపం చూపించాడు. అలాంటి రానా తాను నటించిన బాహుబలి రికార్డులని ప్రాజెక్ట్ K చెరిపేస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

Project K erases Rajamouli records:

Rana Interesting comments on Project K

Tags:   RANA, PROJECT K
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ