దేవర చిత్రంలో ఎన్టీఆర్ ఆల్మోస్ట్ జాలరి పేటలో జాలరి కేరెక్టర్ లోనే కనిపిస్తారని ఎన్టీఆర్ బర్త్ డే కి వచ్చిన ఫస్ట్ లుక్ తోనే కన్ ఫామ్ చేసారు కొరటాల శివ. ఎన్టీఆర్ దేవరగా మత్యకారుల ముసుగులో అవినీతికి పాల్పడే వాళ్ళ భరతం పట్టే బలమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్య కూడా జాలరి అవతారం ఎత్తబోతున్నాడట. కస్టడీ రిజల్ట్ తో కామైన నాగ చైతన్య తదుపరి చిత్రం చందు మొండేటితో ఫిక్స్ అయ్యింది.
గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే ఈ చిత్రం మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది, చేపలను వేటాడటానికి వాడే పడవకు నాగ చైతన్య డ్రైవర్‌గా కనిపిస్తాడు. గుజరాత్‌లో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. అక్కడ చాలా లోతుగా పరిశోధన చేసి మరీ కథ సిద్ధం చేశాం... అంటూ గీత ఆర్ట్స్ లో వన్ అఫ్ ద నిర్మాత బన్నివాస్ రివీల్ చేసాడు. నాగ చైతన్య కేరెక్టర్ కొత్తగా ఉంటుంది అంటూ హైప్ క్రియేట్ చేసాడు బన్నీ వాస్.
ఇక ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కుతోంది.. మిగతా విషయాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ చెప్పారు ఆయన. కార్తికేయ 2 హిట్ తర్వాత చందుమొండేటి నుండి వస్తున్న చిత్రం, గీత ఆర్ట్స్ లాంటి బిగ్ బ్యానర్ సపోర్ట్ చైతూకి దొరకడంతో ఈ చిత్రంపై అంచనాలు మాములుగా లేవు.