ప్రేమించిన రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకునేందుకు శర్వానంద్ సిద్దమయ్యాడు. జూన్ 3 అంటే రేపు శనివారం రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహ మోహోత్సవం అంగరంగ వైభవంగా జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. రాయల్ వెడ్డింగ్ అంటూ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసారు. ఇప్పటికే ఇరు ఫ్యామిలీలు, శర్వానంద్ స్నేహితులు అందరూ రాజస్థాన్ చేరుకున్నారు. నేడు జూన్ 2 న శర్వానంద్ పెళ్లి కొడుకు ఫంక్షన్ జరగబోతుంది.
మెహిందీ, సంగీత్ అన్ని ఇరు కుటుంబాల నడుమ గ్రాండ్ గా ఆరెంజ్ చేసారు. రెండురోజుల పాటు అదిరిపోయేలా జరగబోతున్న శర్వానంద్ పెళ్లి వేడుకలకి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. రక్షిత రెడ్డిది పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడం, శర్వానంద్ కి సినిమా ఇండస్ట్రీ పరిచయాలతో చాలామంది ఈ పెళ్ళికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈరోజు ఉదయం మంగళ స్నానాలు, మెహిందీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సంగీత్ ఉండబోతుంది. ఇక రేపు రాత్రి 11 గంటల నుంచి శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహ వేడుక మొదలు కాబోతుంది. శర్వా పెళ్ళిలో మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతున్నట్లుగా తెలుస్తుంది.