మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు కొద్దిరోజులు నుండి సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఆమె చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకోకముందే నటిగా రాణించాలని అనుకుంది. దానిలో భాగంగానే ముందుగా యాంకరింగ్ రంగంలోకి లోకి దిగింది. తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇద్దామనుకుంది. కానీ ఇంతలోనే పెద్దల కుదుర్చిన చైతన్య ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది అయినప్పటికీ గ్లామర్ గానే కనిపించింది. హనీమూన్ ఫొటోస్ ని షేర్ చేసింది.
ఇక కొన్నాళ్ళు భర్తతో బాగానే ఉన్న నిహారిక ఈమధ్యన అతనితో పొసగక డివోర్స్ తీసుకుంది అనే రూమర్స్ గుప్పుమన్నాయి. అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో కొట్టుకోవడంతో వారు విడాకులు తీసుకున్నారని జనాలు ఫిక్స్ అయ్యారు. ఇక ఆ విడాకుల విషయంపై క్లారిటీ ఇవ్వకుండానే నిహారిక డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. డెడ్ పిక్సల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సీరీస్ సో సో అనిపించింది.
ఇప్పుడిక కొత్తడుగు వేసేందుకు నిహారిక రెడీ అయ్యింది అనిపించేలా ఆమె రీసెంట్ ఫోటో షూట్స్ ఉంటున్నాయి. నీహారిక.. అసలు ఆగేలా లేదిక అన్న రేంజ్ లో ఉంది నిహారిక తాజా ఫోటో. ప్యాంట్ మరియు షార్ట్ షర్ట్ తో కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ తో స్టయిల్ గా నిలబడి ఇచ్చిన ఫోజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.