Advertisementt

సూపర్ స్టార్-మెగాస్టార్ జాతర షురూ

Fri 02nd Jun 2023 10:24 AM
chiranjeevi,rajinikanth  సూపర్ స్టార్-మెగాస్టార్ జాతర షురూ
Superstar-Megastar Jatara Shuru సూపర్ స్టార్-మెగాస్టార్ జాతర షురూ
Advertisement
Ads by CJ

ఆగష్టు లో పది, పదకొండు తేదీల్లో విడుదల కాబోతున్న జైలర్-భోళా శంకర్ సినిమాల జాతర షురూ అయ్యింది. ఇప్పటికే మెగాస్టార్ నుండి భోళా శంకర్ మ్యానియా మొదలు కాబోతుంది అంటూ చిత్ర బృందం ఫాన్స్ ని అలెర్ట్ చేసేసింది. ఇప్పుడు జైలర్ నుండి షూటింగ్ కంప్లీట్ అంటూ కేక్ కట్ చేసి మరీ నెల్సన్ దిలీప్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్ లు ప్రకటించారు. దానితో ఆగష్టు రెండో వారం బాక్సాఫీసు ఇంట్రెస్టింగ్ గా మారింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ కూడా ఆగష్టు 10 న తెలుగులో భారీ ఎత్తున విడుదల కాబోతుండడం, మెగాస్టార్ కి వాల్తేర్ వీరయ్యలాంటి భారీ హిట్ ఉండడం, ఇద్దరూ స్టార్ అండ్ సీనియర్ హీరోలు అవడంతో అందరి చూపు వారిమీదే ఉంది. భోళా శంకర్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఈ రెండు నెలల్లో అంటే సినిమా ఆగష్టు 11 న విడుదలయ్యేవరకు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హైప్ క్రియేట్ చెయ్యాలని మెహర్ రమేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అటు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా జైలర్ విషయంలో తగ్గేదెలా అంటున్నాడు.

అందుకే షూటింగ్ ఫినిష్ అంటూ కేక్ యాక్ట్ చేస్తూ టీం మొత్తం సందడి చేసింది. రజినీకాంత్, తమన్నా, నెల్సన్ అందరూ కలిసి కేరింతలు కొట్టారు. ప్రస్తుతం జైలర్ షూటింగ్ పూర్తయిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మెగాస్టార్-సూపర్ స్టార్ ల జాతర షురూ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేజేస్తున్నారు.

 

Superstar-Megastar Jatara Shuru:

Chiranjeevi vs Rajinikanth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ