Advertisementt

అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం

Thu 01st Jun 2023 06:09 PM
alia bhatt  అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం
Alia Bhatt grandfather Narendranath Razdan passes away at 95 అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అలియా భట్ తాతగారు నరేంద్ర కన్నుమూయడంతో అలియా భట్ ఫ్యామిలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 93 ఏళ్ళ నరేంద్ర వయసుపైడడంతో అనారోగ్య కారణాల వలన కన్నుమూశారు. గత వారం రోజులుగా నరేంద్ర ప్రాణాలతో పోరాడుతూ ఆసుపత్రిలో కన్నుముయ్యడంతో అలియా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తాతగారి మరణాన్ని చెబుతూ అలియా భట్ ఎమోషనల్ గా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.

తాతయ్య నువ్వే నా హీరో. 93 ఏళ్ళ వయసులో కూడా గోల్ఫ్ ఆడావు. నా కోసం టేస్టీగా ఆమ్లెట్ వేసి ఇచ్చేవాడివి, మొన్నటివరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. వయోలిన్ వాయించేవాడివి, నాకు బోలెడన్ని స్టోరీస్ చెప్పేవాడివి. నీ ముని మనవరాలు రాహా తో ఆటలాడుకున్నావు. నువ్వు క్రికెట్ ఆడే విధానం అన్నా, నీవు వేసే స్కెచ్ లున్న చాలా ఇష్టం. నువ్వు నీ ఫ్యామిలీని ఎంతో ప్రేమించావు. ఇప్పుడు నువ్వు లేవన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాము.

నా మనసంతా బాధతో నిండిపోయింది. అదే టైమ్ లో బోలెడంత సంతోషంగా ఉంది. ఎందుకంటే మా తాతయ్య బోలెడంత ఆనందాన్ని అందించాడు. దానికి చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. మనం మళ్ళీ కలుసుకునేవరకు ఇవన్నీ పదిలంగా దాచుకుంటాను అంటూ అలియా భట్ ఇన్స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది.

Alia Bhatt grandfather Narendranath Razdan passes away at 95:

Alia Bhatt pens a heartfelt note as her grandfather passes

Tags:   ALIA BHATT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ