సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. వాళ్ళ కామెంట్లు - కౌంటర్లు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. సినిమాల కలెక్షన్సే కాదు.. వ్యూస్, లైక్స్, రీట్వీట్స్ అన్నీ రికార్డులే వాళ్ళకి. అన్నిటా పోటీ తత్వమే వాళ్ళది. కుదిరితే ఆధారాలు తెస్తారు.. లేదంటే ఏదో ఒక వాదనతో వస్తారు. మొత్తానికైతే ఫ్యాన్ వార్ జరగాల్సిందే. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నిన్నటినుంచీ ఓ కొత్త ఆరోపణ ఎత్తుకున్నారు పవన్ ఫ్యాన్స్.
నిన్న విడుదల అయిన మహేష్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ 24 గంటల్లోనే 24 మిలియన్ల వ్యూస్ దిశగా దూసుకుపోవడం డైజెస్ట్ అవ్వట్లేదు పవన్ అభిమానులకి. దాంతో మావే ఎక్కువ లైక్స్ అనీ, మేమే ఫాస్ట్ గా మైల్ స్టోన్స్ రీచ్ అయ్యామనీ వాదోపవాదాలు మొదలయ్యాయి. అక్కడితో ఆగకుండా ఓ వింత ఆరోపణ తెరపైకి తెచ్చారు. ఎన్ఠీఆర్, మహేష్ బాబు సినిమాలకి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వలనే టైటిల్స్ దొరికాయట. భీమ్లా నాయక్ నుంచే ఈ హీరోలిద్దరి సినిమాలకు పేర్లు పెట్టుకున్నారట. అదెలాగంటే...
భీమ్లా నాయక్ లో పవన్ పాత్రను దేవర అని సంబోధించడం, ఆ దేవరను బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించి రెన్యువల్ మరిచిపోవడం అందరికీ తెలిసిందే. అదను చూసి ఆ టైటిల్ ఎన్టీఆర్ పట్టుకుపోయాడట. ఇక భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో గుంటూరు కారం.. ఆ యూనిఫారం అనే లిరిక్స్ నుంచే త్రివిక్రమ్ గుంటూరు కారం పదాన్ని మహేష్ సినిమాకి పెట్టేసుకున్నాడట. గుంటూరు ఏదో భీమ్లా తోనే పుట్టినట్టు.. నాయక్ స్వయంగా ఆ కారాన్ని కనిపెట్టినట్టు వితండవాదం వినిపించేస్తున్నారు పవన్ అభిమానులు. కల్ట్ ఫ్యాన్స్ అయుండొచ్చు కానీ కాస్త కామన్ సెన్స్ కూడా ఉండాలి కదా అని నవ్వుకుంటున్నారు ఇదంతా చూస్తోన్న నెటిజన్లు.!