ఖుషీ కపుల్ విజయ్ దేవరకొండ - సమంత ప్రస్తుతం టర్కీలో ఖుషీ ఖుషీగా గడుపుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా నటిస్తోన్న ఖుషీ చిత్రం షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన ఈ జోడీ ఓవైపు చిత్రీకరణలో పాల్గొంటూనే, తీరిక వేళల్లో ఇస్తాంబుల్ వీధుల్లో విహరిస్తూ అక్కడి ఫుడ్ వెరైటీస్ ని, యాంబియన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బేసిక్ గా మంచి ఫుడ్డీస్ అయిన ఈ జంట టర్కీ వంటల్ని టేస్ట్ చేస్తోన్న దృశ్యాన్ని అభిమానులకి షేర్ చేసింది సమంత. అంతే కాదు.. Sees you at your best, sees you at your worst. Sees you come last, sees you come first. Sees your lows, sees your highs. Some friends gently standby 🤍 What a year it has been!! @thedeverakonda 🤍 📸 @shivanirvana621 🤍 #Kushi అంటూ ఇన్ స్టాలో చేసిన పోస్ట్ కి లైక్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇక సినిమా విషయానికి వస్తే.. సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల చాలాకాలం నిలిచిపోయిన ఖుషీ షూటింగ్ ఇప్పుడు మాత్రం పరుగులు పెడుతోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, ఈ టర్కీ షెడ్యూల్ తో మేజర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 1న రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగల్ విడుదల కాగా నా రోజా నువ్వే అంటూ మణిరత్నం సినిమాల టైటిల్సే లిరిక్స్ గా సాగే ఆ పాటకి అద్భుతమైన స్పందన లభించింది. యూట్యూబ్ లో 23 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోన్న ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో లక్షకి పైగా రీల్స్ రావడం విశేషం. అన్నట్టు ఈ పాటని స్వయంగా దర్శకుడే రాసారండోయ్.!
హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ తో.. సెన్సిబుల్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ ఖుషీ చిత్రంపై అంతటా మంచి అంచనాలు ఉన్నాయి. అంతకుమించి అటు విజయ్ దేవరకొండకు - ఇటు సమంతకు ఈ చిత్రం స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ అవ్వాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ ప్రీవియస్ ఫిల్మ్ లైగర్ కు - సమంత రీసెంట్ రిలీజ్ శాకుంతలంకు ఒకే తరహా రిజల్ట్స్ వచ్చాయి.. ఒకే రేంజ్ డిజాస్టర్లుగా మిగిలాయి. మరి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషి టైటిల్ రిపీట్ చేస్తున్నారు కనుక రిజల్ట్ కూడా అదే స్థాయిలో వచ్చి వీరిద్దరినీ మళ్ళీ విజయాల బాట పట్టిస్తుందని ఆశిద్దాం.!