Advertisementt

చీరకట్టుతో కవ్విస్తోన్న అందమైన ఆకృతి

Sun 04th Jun 2023 08:29 AM
krithi shetty  చీరకట్టుతో కవ్విస్తోన్న అందమైన ఆకృతి
Krithi Shetty Latest Photo Shoot చీరకట్టుతో కవ్విస్తోన్న అందమైన ఆకృతి
Advertisement
Ads by CJ

తొలి చిత్రంలోనే పసిడి పరువాల జలపాతంలా తెరపై ప్రేక్షకుల కళ్ళకు కనువిందు చేసి.. యువకుల కలలను ఉప్పెనలా ముంచెత్తింది కృతి శెట్టి. దాంతో అవకాశాలు వెల్లువెత్తాయి. రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చాయి. కానీ లక్కు మాత్రం ఒక్క సినిమాకే సపోర్ట్ చేసింది. బ్యాడ్  లక్ మాత్రం బెస్ట్ ఫ్రెండ్ లా పక్కనే సెటిల్ అయింది.

దాంతో రామ్ తో చేసిన ది వారియర్ వాత పెట్టి పోయింది. నితిన్ తో కలిసి మాచర్ల నియోజక వర్గం వెళ్లినా సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ సుధీర్ బాబు ట్రై చేస్తే అక్కడా లక్కు వెక్కిరించింది. చివరికి తనెంత కష్టపడ్డా నాగ చైతన్య కస్టడీ కూడా నిరాశనే మిగిల్చింది. మధ్యలో వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు ఫలితాలు పర్లేదనిపించేవే తప్ప ఉప్పెన అంతటి గొప్ప విజయం ఇప్పటి వరకూ మళ్ళీ కృతి చెంతకు చేరలేదు. 

ఇక ఇప్పుడు అనుకోని గ్యాప్ రావడంతో అక్కర్లేనంత రెస్ట్ దొరికేసింది అమ్మడికి. ఇన్నాళ్లూ విరామం లేకుండా వర్క్ చేసిన బేబమ్మకి ఇప్పుడిలా దొరికిన ఈ తీరిక కూడా బోరింగ్ గా అనిపించిందేమో... సినిమా షూట్ లేకుంటేనేం, ఫోటో షూట్ కి రెడీ అంటూ రోజుకో కాస్ట్యూమ్ తో రెచ్చిపోతూ... ఆశిస్తోన్న అవకాశాలకి అందమైన ఆకృతితో గాలం వేస్తోంది కృతి. 

అయితే ఆఫర్స్ కోసం మరీ బరి తెగించేసిన రీతిలో అందాల ఆరబోతకు సిద్దపడకుండా కాస్త పద్దతిగానే ప్రయత్నిస్తోన్న కృతిని ప్రస్తుతానికైతే ప్రశంసిద్దాం. శెట్టి గారు ఇలా ఎంతకాలం గట్టిగా పట్టుదలగా ప్రయత్నిస్తారో.. చీరకట్టు తోనే ఏ ఛాన్సులు పట్టుకుంటారో.. కెరీర్ ని ఎలా నెట్టుకెళతారో చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ బేబమ్మా..!

Krithi Shetty Latest Photo Shoot:

Krithi Shetty Latest Photos

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ