నాంది తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లరి నరేష్ విజయ్ కనకమేడల కాంబోలో తెరకెక్కిన ఉగ్రం మూవీ మే 5 న థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ తో పాటుగా విమర్శకులు మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. నాంది హిట్ రిపీట్ అవ్వుద్ది అనుకుంటే ఉగ్రం మాత్రం ఓ వర్గం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నటన హైలెట్ అయ్యింది. ఉగ్రం లాంగ్ రన్ లో పర్వాలేదనిపించే కలెక్షన్స్ తెచ్చుకుంది.
అయితే మే5 న థియేటర్స్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్స్ కి రెడీ అయ్యింది. ఈమధ్యన చెప్పుకున్నటుగానే హిట్ సినిమా నెలకి, ప్లాప్ సినిమా మూడు వారాలకు అన్నట్టుగా ఉగ్రం మూవీ జూన్ 2 న అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ కానున్నట్లుగా సమాచారం. ఓటిటీ హక్కులని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ ఉగ్రం మూవీని థియేటర్స్ లో విడుదల చేసిన నెలలోపులోనే డిజిటల్ ప్రీమియర్స్ కి రెడీ చేసింది.
మరి ఉగ్రం మూవీని థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇకపై అంటే జూన్ 2 నుండి ఓటిటిలో వీక్షించవచ్చు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.