కొన్నేళ్లుగా జబర్దస్త్‌లో సక్సెస్‌ఫుల్ కమెడియన్‌గా కొనసాగుతూ కామెడీ ప్రియులని విశేషంగా అలరించి సిల్వర్ స్క్రీన్‌కి పూల బాటలు వేసుకున్న హైపర్ ఆది.. గత ఏడాది జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. వరస స్కిట్స్ కొడుతూ టాప్ కమెడియన్‌గా మారిన ఆదిని చాలామంది కామెడీ ప్రియులు ఆ సమయంలో మిస్ అయ్యారు. ఢీ డాన్స్ షో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలలో కనిపిస్తున్న హైపర్ ఆది.. జబర్దస్త్ నుండి తప్పుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి, అభిమానులు బాగా నిరాశకు లోనయ్యారు.
జబర్దస్త్ పాత మేనేజర్ ఏడుకొండలు ఖచ్చితంగా ఆది తిరిగి వెనక్కి వస్తాడంటూ కామెంట్స్ చేశాడు. ఏడుకొండలు యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన కొద్దిరోజులకే హైపర్ ఆది జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కొద్దిరోజులపాటు జబర్దస్త్‌లో కొనసాగిన హైపర్ ఆది స్కిట్స్‌లో పెద్దగా యాక్టీవ్‌గా కనిపించలేదు, ఏదో రావాలని లేదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఇక కొద్దివారాలుగా హైపర్ ఆది జబర్దస్త్‌లో కనిపించడం లేదు. ఆది టీమ్ కూడా తీసేశారు.
ఆది టీమ్ ప్లేస్‌లోకి కొత్తగా నెల్లూరు నీరజ అంటూ కొత్త టీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ టీంలో అందరూ కొత్తవాళ్లే. రీసెంట్‌గా వారు సీనియర్ టీమ్స్‌ని బీట్ చేసి మరీ స్కిట్ కొట్టింది. నెల్లూరు నీరజ టీం చాలా త్వరగా జబర్దస్త్‌లో క్రేజ్ తెచ్చేసుకుంటుంది. అది చూసిన వారు ఆది ప్లేస్‌లోకి జబర్దస్త్ టీం ఎంట్రీ ఇచ్చింది అంటున్నారు. కానీ ఆది కామెడీని మిస్ అయ్యినవారు మాత్రం మళ్ళీ ఆది రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు.
జబర్దస్త్ వదిలేసినా హైపర్ ఆది మాత్రం ఢీ షో ని.. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీని మాత్రం వదల్లేదు. మరి జబర్దస్త్‌ని ఆది కావాలనే దూరం పెడుతున్నాడా ఇప్పుడు అందరిలో ఇదే ప్రశ్న మెదులుతోంది.