Advertisementt

కిర్రాక్ ఆర్పీ ఇండస్ట్రీని వదిలేశాడా?

Wed 31st May 2023 11:43 PM
kirrak rp,industry,good bye,jabardasth,  కిర్రాక్ ఆర్పీ ఇండస్ట్రీని వదిలేశాడా?
Kiraak RP says good bye to Industry కిర్రాక్ ఆర్పీ ఇండస్ట్రీని వదిలేశాడా?
Advertisement
Ads by CJ

కిర్రాక్ ఆర్పీ సినిమా ఇండస్ట్రీని వదిలేశాడా..? అందుకే సినిమాల్లో కూడా కనిపించడం లేదా? ఇప్పుడు చాలామందిలో ఇదే అనుమానం మెదులుతుంది. కొన్నాళ్లుగా అంటే దాదాపు రెండున్నరేళ్లుగా కిర్రాక్ ఆర్పీ యూట్యూబ్ లో తప్ప సినిమాల్లో కానీ, టివి షోస్ లో కానీ కనిపించలేదు. డిసెంబర్ లో చేపల పులుసు అంటూ కూకట్ పల్లిలో కర్రీ పాయింట్ తెరిచి చాలా త్వరగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్స్ చేస్తే కానీ రాని ఫేమ్ చేపల పులుసులో చాలా తొందరగానే అందుకున్నాడు.

నెల్లూరు పెద్ద రెడ్డి చేపలపులుసు అంటూ కూకట్ పల్లి, మణికొండ, SR నగర్ లలో బ్రాంచెస్ ఓపెన్ చేశాడు. తాను చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఈ చేపల పులుసుని డెవెలెప్ చేస్తున్నాడు. ఇక చేపల పులుసు కట్టి పాయింట్ మొదలు పెట్టిన కొత్తల్లో ఆర్పీ ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ తన చేపల పులుసుని పబ్లిసిటీ చేసుకున్నాడు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తెగ ఫేమస్ అయ్యాడు.

ఇక చేపల పులుసు సక్సెస్ అవడంతో ఆర్పీ ఇకపై సినిమాలు చెయ్యడేమో.. అలాగే కామెడీ కూడా పక్కనపెట్టేస్తాడేమో.. సినిమాలోకి దర్శకుడిగానే మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కొన్నాళ్లుగా ఆర్పీ మాత్రం సినిమా ఇండస్ట్రీలో మాత్రం కనిపించడం లేదు.

Kiraak RP says good bye to Industry:

No chances to Kiraak RP In Industry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ