Advertisementt

పవన్ OG పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Wed 31st May 2023 09:02 PM
og,pawan kalyan,december release,sujeeth,dvv daanayya  పవన్ OG పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting News on Pawan Kalyan Movie OG పవన్ OG పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్‌లో సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. సాహో దర్శకుడు సుజిత్‌తో సినిమా కమిట్ అవడమే తరువాయి సెట్స్ మీదకి వెళ్ళిపోయి అప్పుడే రెండో షెడ్యూల్ పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రం షూటింగ్ జెట్ స్పీడులో సాగిపోతుంది.

ఇప్పటివరకు ముంబై పరిసరాల్లో, పూణేలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ పవన్‌కి అనుకూలంగా హైదరాబాద్‌లోనే మొదలు పెట్టారు. చకచకా సుజిత్-దానయ్యల చిత్రాన్ని పవన్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్తితుల్లో డిసెంబర్‌లోనే విడుదల చెయ్యాలని.. అది కూడా చివరి వారమైతే లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది అని.. మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. మరి షూటింగ్‌కి పవన్ పక్కాగా అంటే పర్ఫెక్ట్ గా హాజరైతే.. రిలీజ్ డేట్ ఇవ్వడం కూడా మేకర్స్ కి సులువవుతుంది.

ఎందుకంటే హరిహర వీరమల్లు చిత్రానికి పవన్ పక్కాగా డేట్స్ ఇవ్వకపోవడంతోనే ఆ సినిమా ఇప్పటివరకు రిలీజ్ తేదీ కానీ, టీజర్ కానీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. OG విషయంలో అలా జరగదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ OG ని డిసెంబర్‌లోనే తెచ్చేలా గట్టి ఆలోచనలోనే మేకర్స్ ఉన్నారని సమాచారం.

Interesting News on Pawan Kalyan Movie OG:

OG Movie Latest Update Movie Will Release in December

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ