పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవడంతో.. ఇపుడు అదే కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంతే అంచనాలున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ లోను పోలీస్ గెటప్ లోనే పవన్ ని ప్రెజెంట్ చేస్తున్నాడు హరీష్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఫాన్స్ ని మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ టీజర్ పై డైరెక్టర్ తేజ ఉస్తాద్ భగత్ సింగ్ సరే షాట్ హిట్(దర్శకుడు తేజ – ఉస్తాద్ భగత్ సింగ్ ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నాను) అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
దర్శకుడు తేజ ని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ పవన్ కళ్యాణ్ గారితో అయితే ఎలాంటి స్టోరీ చేస్తారు అని అడగగా.. దానికి ఆయన ఈ మధ్యనే రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో చాలా బాగుంది అని, పవన్ కళ్యాణ్ తో సినిమా అలా ఉండాలి, గ్లింప్స్ చూడగానే ఖచ్చితంగా హిట్ అనిపించింది అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ గురించి చెప్పుకొచ్చారు. దానితో హరీష్ శంకర్ ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా థాంక్యూ తేజ గారు అని అన్నారు.