యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో చాలా అరుదుగా కనిపిస్తారు. తన కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎన్టీఆర్ ఆడుకుంటున్న పిక్స్ ఒకటో రెండో మాత్రం సోషల్ మీడియాలో కనిపిలుస్తాయి. ఎన్టీఆర్ భార్య కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండదు. చాలా తక్కువగానే ఆమె పబ్లిక్ లో కనిపిస్తుంది. ఇక కొన్నాళ్లుగా తన భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలతో టైమ్ స్పెండ్ చెయ్యడానికి అని వెకేషన్స్ ప్లాన్ చేసుకుని విదేశీ ట్రిప్స్ వెళుతున్నారు ఎన్టీఆర్.
గత డిసెంబర్ లో భార్య పిల్లలతో కలిసి అమెరికా వెళ్లి లాంగ్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు సమ్మర్ ట్రిప్ అంటూ భార్య పిల్లలతో కలిసి ఫ్లైట్ ఎక్కాడు. స్మాల్ ట్రిప్ గా ఈ వెకేషన్స్ ని ప్లాన్ చేసుకున్న ఎన్టీఆర్ వెకేషన్స్ లోనూ చమటలు చిందిస్తూ వర్కౌట్స్ చేస్తున్నారు. ఇక పిల్లలు భార్గవ్, అభయ్ లు కూడా ఈ వెకేషన్స్ ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో అనేది ఈ పై పిక్ చూస్తే తెలుస్తుంది.
అన్నదమ్ములిద్దరూ హాగ్ చేసుకున్న ఈ క్యూట్ అండ్ స్వీట్ పిక్ ని ఎన్టీఆర్ ఫాన్స్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ భార్య పిల్లలతో ట్రిప్ ముగించుకుని రాగానే దేవర షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో కొరటాల యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది.