Advertisementt

SSMB28 మాస్ గ్లిమ్ప్స్ కి టైమ్ ఫిక్స్

Tue 30th May 2023 01:20 PM
mahesh babu,ssmb28  SSMB28 మాస్ గ్లిమ్ప్స్ కి టైమ్ ఫిక్స్
Time locked for Mahesh vintage strike SSMB28 మాస్ గ్లిమ్ప్స్ కి టైమ్ ఫిక్స్
Advertisement
Ads by CJ

రేపు సూపర్ స్టార్ కృష్ణగారి వర్ధంతి స్పెషల్ గా మహేష్ బాబు రీసెంట్ మూవీ SSMB28 నుండి టైటిల్ అలాగే గ్లిమ్ప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. గత నాలుగు రోజులుగా SSMB28 అప్ డేట్స్ పై మేకర్స్ రేపుతున్న అటెన్షన్ మాములుగా లేదు. మహేష్ బాబు ని మాస్ గా చూపిస్తూ లుక్స్ వదులుతూ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ గుంటూరు కారం టైటిల్ నే మేకర్స్ SSMB28 కి ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే రేపు రాబోతున్న SSMB28 గ్లిమ్ప్స్ అలాగే టైటిల్ అనౌన్సమెంట్ కి ఇప్పుడు టైమ్ ఫిక్స్ చేసారు. సూపర్ కృష్ణగారు నటించిన మోసగాళ్లకు మోసగాళ్లు రేపు థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ చిత్రంతో పాటుగా మహేష్ SSMB28 టైటిల్ అండ్ గ్లిమ్ప్స్ కూడా థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి. అభిమానుల ఆనందోత్సాహాల మధ్యన రేపు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి మహేష్ మాస్ బ్లాస్ట్ పేలనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అప్ డేట్స్ తోనే హంగామా చేస్తున్న మహేష్ మేకర్స్.. గ్లిమ్ప్స్ తో ఫాన్స్ కి ఎంతెలాంటి ట్రీట్ ఇస్తున్నారో కానీ మహేష్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో వారం రోజులుగా #SSMB28Glimps హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.  

Time locked for Mahesh vintage strike:

Mahesh mass strike from SSMB28 at this time

Tags:   MAHESH BABU, SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ