సినిమా ఇండస్ట్రీకి ఫెస్టివల్స్ సీజన్ ఎంత ఇంపార్టెంటో.. వేసవి సెలవలు సీజన్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే పెద్ద సినిమాలు చాలావరకు సమ్మర్ హాలిడేస్ ని టార్గెట్ చేస్తాయి. సమ్మర్ వస్తే స్టూడెంట్స్ హాలిడేస్ తో ఖాళీగా ఉంటారు. అలాగే చాలామంది సమ్మర్ సెలవలు తీసుకుని వెకేషన్స్ కి, సినిమాలకి వెళ్లారు. అందుకే ఎక్కువుగా అదే సీజన్ ని టార్గెట్ చేస్తారు సినిమా వాళ్ళు. కానీ ఈ ఏడాది ఒక్క పెద్ద సినిమా కూడా బాక్సాఫీసుని షేక్ చెయ్యడానికి రాలేదు.
చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలతో పాటుగా.. డబ్బింగ్ సినిమాలే బాక్సాఫీసుని టార్గెట్ చేసాయి. ఏప్రిల్ 21 విరూపాక్ష సక్సెస్ తర్వాత మళ్ళీ అంత ఇంట్రెస్టింగ్ సినిమా కనిపించలేదు. భారీ అంచనాల మధ్యన విడుదలైన అఖిల్ ఏజెంట్, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులని బాగా నిరాశపరిచాయి. తర్వాత మే 5 న విడుదలైన ఉగ్రం ఓకె ఓకె, రామబాణం డిసాస్టర్ అయ్యాయి. మే 12 న విడుదలైన నాగ చైతన్య కస్టడీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.
తర్వాత వారం మే 18 న విడుదలైన అన్ని మంచి శకునములే డిసాస్టర్ కాగా.. తమిళ డబ్బింగ్ తెలుగులో విడుదలై ఇరగదీసింది. ఇక తర్వాత వారం అంటే గత శుక్రవారం చిన్న సినిమాలు మళ్ళీ పెళ్లి, మేమ్ ఫేమస్ మెన్ టూ చిత్రాలతో పాటుగా మలయాళ డబ్బింగ్ 2018 రిలీజ్ అవగా.. అందులో 2028 తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక వచ్చే వారం కుర్ర హీరోలు అహింస-నేను స్టూడెంట్ సర్ తో పోటీపడుతున్నారు.
మరి పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోయినా.. మీడియం బడ్జెట్ సినిమాలైనా ఈ వేసవి సెలవల్లో ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేస్తాయనుకుంటే అవి కూడా ఆడియన్స్ ని మెప్పించలేక సైలెంట్ అయ్యాయి. మరి జూన్ 16న రాబోతున్న ఆదిపురుష్ ఏం చేస్తుందో చూడాలి.