Advertisementt

ధనుష్ షాకింగ్ లుక్

Tue 30th May 2023 11:47 AM
dhanush  ధనుష్ షాకింగ్ లుక్
Dhanush shocking look ధనుష్ షాకింగ్ లుక్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో ధనుష్ మాస్ గాను కనిపిస్తాడు, స్టయిల్ గాను కనిపిస్తాడు, ఎలాంటి కేరెక్టర్ లో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ధనుష్ ఈమధ్యనే సార్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. హాలీవుడ్ మూవీలోనూ సత్తా చాటిన ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీతో త్వరలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వ్యక్తిగత జీవితంలో భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడిపోయాడు. పిల్లల కోసం అప్పుడప్పుడు భార్య-భర్తలు స్నేహపూర్వకంగా కలుస్తూనే ఉంటారు.

ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ కోసం డిఫరెంట్ మేకోవర్ లోకి ధనుష్ మారిపోయాడు. అది కూడా షాకింగ్ లుక్ లోకి. తాజాగా ధనుష్ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ధనుష్ కొత్త లుక్ చూసిన అభిమానులే షాకవుతుంటే మిగతా ప్రేక్షకుల పరిస్థితి ఏమిటో కదా. లాంగ్ హెయిర్, గుబురుగా బాగా పెరిగిన గెడ్డంతో గుర్తుపట్టడానికి వీల్లేనంతగా ధనుష్ మేకోవర్ చూస్తే వామ్మో ధనుష్ ఏమిటిది అంటారేమో..

అంతలాంటి లుక్ తో ధనుష్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. ధనుష్ ఈ కొత్త లుక్ కెప్టెన్ మిల్లర్ కోసమే అంటున్నారు. బయట క్యాజువల్ గా చూస్తేనే ఇలా ఉంటే.. సినిమాలో ఇంకెలా కనిపిస్తాడో అంటూ అభిమానులు ఇమాజిన్ చేసుకుంటున్నారు.

Dhanush shocking look:

South star Dhanush debuts new look at Mumbai airport

Tags:   DHANUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ