Advertisementt

మళ్ళీ పెళ్లిపై మళ్ళీ విమర్శలు

Tue 30th May 2023 09:20 AM
malli pelli  మళ్ళీ పెళ్లిపై మళ్ళీ విమర్శలు
Malli Pelli public talk మళ్ళీ పెళ్లిపై మళ్ళీ విమర్శలు
Advertisement
Ads by CJ

నరేష్-పవిత్ర లోకేష్ కలయికలో MS రాజు తెరకెక్కించిన మళ్ళీ పెళ్లి మూవీ గత శుక్రవారం విడుదలైంది. నరేష్-పవిత్రలు చేసిన రొమాన్స్ ప్రమోషన్స్ తో సినిమాపై ఎంతోకొంత ఆసక్తి పెరిగి మొదటిరోజు థియేటర్స్ కి జనాలు బాగానే వచ్చారు, సినిమాని ఇంట్రెస్టింగ్ గా చూసారు. కానీ సినిమా చూసాక చాలామంది నరేష్-పవిత్రలు తమ వ్యవహారాన్ని ఏ ప్రెస్ మీట్ పెట్టి చెబితేనో సరిపోయేది, దాని కోసం సినిమా చెయ్యాలా.. ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా అన్నారు.

మూడో భార్య చెడ్డది అని చెప్పడానికే నరేష్ ఇంతగా ఖర్చు పెట్టి సినిమా చేసారు.. ఇలా చెబితే అబద్దాలు నిజాలైపోవు, నిజాలు అబద్దలైపోవు కదా. దీని కోసం సినిమా చెయ్యాల్సిన అవసరం ఏమిటో ఆయనకే తెలియాలి. పదే పదే విజయ నిర్మల-కృష్ణ గార్ల పేర్లు వాడేసుకోవడం, అవకాశం వచ్చినప్పుడల్లా మూడో భార్య నెగిటివిటీని చూపించడం ఇదంతా నరేష్ వయసుకి అవసరమా అనే విమర్శలు మొదలయ్యాయి. 

మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో కాంట్రవర్సీ నటి వనితా విజయ్ కుమార్ నటించింది. ఆమెని పూర్తి నెగటివ్ షేడ్స్ లో చూపించారు. నరేష్-పవిత్రల మళ్ళీ పెళ్లి కోసం, రమ్య రఘుపతితో విడాకుల కోసం ఇంత డబ్బు వదిలించుకుని సినిమా చేసారు.. అదేదో లాయర్లకు ఇస్తే విడాకులు రావా.. ఇంత ఖర్చుపెట్టి మరొకరిపై నిందలు వేయడం సరైనది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

మొత్తానికి నరేశ్ తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో బాగా బ్యాడ్ అయ్యారు.

Malli Pelli public talk:

Malli Pelli Monday talk

Tags:   MALLI PELLI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ