అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కిన పుష్ప ద రైజ్ విడుదలైన అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకుంది. డిసెంబర్ 17 2021 లో విడుదలైన ఈ చిత్రం కరోనా క్రైసిస్ ని లెక్క చెయ్యకుండా ఒక్క నార్త్ లోనే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ కొల్లగొట్టడంతో ఇప్పుడు రాబోయే పుష్ప ద రూల్ పై అంచనాలు పెరిగేలా చేసింది. ప్రస్తుతం మారేడుమిల్లు అడవుల్లో ఫుల్ స్వింగ్ లో సాగుతున్న పుష్ప ద రూల్ లో ఫహద్ ఫాసిల్ పై ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ అయినట్లుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు.
అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా పుష్ప 2 నుండి స్పెషల్ వీడియో వదిలిన తర్వాత పుష్ప 2 రిలీజ్ డేట్ ఇస్తారని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ డేట్ కూడా చాలా త్వరగా ప్రకటిస్తారని అనుకున్నారు. మేకర్స్ మాత్రం పుష్ప 2 రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా పుష్ప రూల్ రిలీజ్ తేదీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
ఇది వచ్చే ఏడాది 2024 జనవరిలో అయితే పండగ పోటీ బాగా ఉన్న కారణంగా డిసెంబర్ లాస్ట్ వీక్ లో హాలిడేస్ కలిసొచ్చేలా ఉండడంతో.. డిసెంబర్ 20 నుండి 30 మధ్యలో ఏదో ఒక తేదీ ముఖ్యంగా డిసెంబర్ 24 కానీ 26 కానీ పుష్ప 2 ని ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తేవడమే కాకుండా.. చైనా, జపాన్, మలేషియా లాంటి దేశాల్లో కూడా ఆ లాంగ్వేజెస్ లో విడుదల చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.