Advertisementt

ఇది ఆదిపురుష్ రేంజ్

Mon 29th May 2023 07:53 PM
adipurush  ఇది ఆదిపురుష్ రేంజ్
This is the Adipurush range ఇది ఆదిపురుష్ రేంజ్
Advertisement
Ads by CJ

టీజర్ చూసి ఆదిపురుష్ పని అవుట్ అన్నవారే.. ఇప్పుడు ఆదిపురుష్ లో మేటర్ ఉంది అంటున్నారు. ప్రభాస్ ని మోడరన్ రాముడిగా కృతి సనన్ ని మోడరన్ సీతగా, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ ని ఓం రౌత్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆదిపురుష్ ట్రైలర్ తో పాటుగా ఆదిపురుష్ నుండి విడుదలవుతున్న పాటలు మెస్మరైజ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆదిపురుష్ రేంజ్ ఏమిటో దానికి జరుగుతున్న బిజినెస్ చూస్తే తెలుస్తుంది.

ఆదిపురుష్ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కనీవినీ ఎరుగని రీతిలో మొదలైంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ఆదిపురుష్ రైట్స్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు దాదాపు 185 కోట్లకు సొంతం చేసుకున్నట్టు చెపుతున్నారు. అసలైతే ఆదిపురుష్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో యువీ క్రియేషన్స్ వారు రిలీజ్ చెయ్యాల్సి ఉంది. 

కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి ఈ డీల్ ను ప్రభాస్ దగ్గరుండి చేయించాడని సమాచారం. నైజాం రైట్స్ ను 80 కోట్లకు, ఈస్ట్ గోదావరి రైట్స్ ను 15 కోట్లకు, సీడెడ్ రైట్స్ ను 15 కోట్లకు అమ్మేసినట్టుగా కొన్ని లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేస్తూ ఇది  కదా ఆదిపురుష్ రేంజ్ అంటున్నారు. అసలే నిన్నటివరకు దిగాలుగా ఉన్న ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు కాస్త సంతోషంగానే కనబడుతున్నారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ లెక్కలు, ఆదిపురుష్ నుండి విడుదలవుతున్న పాటలు.. ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్న కారణంగా వారు సంతోషంలో ఉన్నారు. ఇక ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో జరగబోతోంది.

This is the Adipurush range:

Adipurush telugu states business deal closed

Tags:   ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ