స్టార్ హీరో ప్రభాస్ తన స్నేహితులతో కలిసి యువీ క్రియేషన్స్ బ్యానర్ మీద సినిమాలు చెయ్యడం, ప్రభాస్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ లో యువీ క్రియేషన్స్ వన్ అఫ్ ద పార్ట్నర్ గా కొనసాగడం, ప్రభాస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో తెలుగు రైట్స్ యువీ వారు తీసుకోవడం ఇలా ఏదో విధంగా ప్రభాస్ తన స్నేహితులని తాను చేస్తున్న ప్రాజెక్ట్స్ లో భాగం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ సొంత బ్యానర్ గా ఉన్న యువీ క్రియేషన్స్ ని ప్రభాస్ పక్కనబెడుతున్నారనే న్యూస్ ఫాన్స్ ని కలవరపెడుతుంది.
కారణం ఏమిటంటే ఇప్పుడు యువీ క్రియేషన్స్ పేరు ఉండాల్సిన ప్లేస్ లోకి పీపుల్స్ మీడియా వచ్చి చేరింది. ఇప్పటికే టీ సీరీస్-యువీ క్రియేషన్స్ లో తెరకెక్కాల్సిన సందీప్ వంగా-ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ నుండి యువీ వారు తప్పుకోగా.. దానిలోకి పీపుల్స్ మీడియా వారు వచ్చి చేరారని తెలుస్తుంది. మరోపక్క తెలుగులో ఆదిపురుష్ రిలీజ్ యువీ బ్యానర్ నుండి ఉంటుంది అని అనౌన్సమెంట్ వచ్చింది.
కానీ ఇప్పుడు ఆదిపురుష్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సైతం పీపుల్స మీడియా వాళ్లు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు గా రీసెంట్ సమాచారం. మరి ఓన్ బ్యానర్ అయిన యువీ వారిని ప్రభాస్ తప్పించి మరో బ్యానర్ పీపుల్స్ మీడియా వాళ్ళకి తన సినిమా హక్కులు ఇప్పించడం, అలాగే టి సీరీస్ వారితో భాగం చెయ్యడం, అంతేకాకుండా ఇప్పుడు ఓ సినిమా పీపుల్స మీడియా వారితో చేసే ఊపులో ప్రభాస్ ఉండడం చూస్తుంటే ప్రభాస్ సొంత బ్యానర్ ని పక్కనబెడుతున్నారేమో అనిపించకమానదు.