Advertisementt

మామ - అల్లుళ్ళ పోస్టర్ అదిరింది బ్రో !

Mon 29th May 2023 10:56 AM
pawan kalyan,sai dharam tej  మామ - అల్లుళ్ళ పోస్టర్ అదిరింది బ్రో !
Mama - Allulla BRO poster is here మామ - అల్లుళ్ళ పోస్టర్ అదిరింది బ్రో !
Advertisement
Ads by CJ

మెగా మామ - అల్లుళ్ళు, పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రో ద అవతార్ మూవీ నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా మెగా ఫాన్స్ సర్ ప్రైజ్ అవుతూ క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బ్రో మోషన్ పోస్టర్, సాయి ధరమ్ తేజ్ ల మార్కండేయుడి లుక్స్ కి ఇంప్రెస్స్ అయినప్పటికీ ఫాన్స్ వీరిద్దరి కలయికలో పోస్టర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పవన్-సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బ్రో పై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోనూ భారీ అంచనాలున్నాయి.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న సాలిడ్ పోస్టర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రివీల్ చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఇవాళ(మే 29న) మార్నింగ్ 10.08 నిమిషాలకు పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో పవన్ బైక్ మీద కాలు పెట్టి నిలబడగా, ఆయన మోకాలు మీద చెయ్యిపెట్టి సాయి తేజ్ స్టయిల్ గా నిలబడి కనిపించాడు. ప్రస్తుతం మామ - అల్లుళ్ళ  పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

సముద్రఖని షూటింగ్ మొదలు పెట్టడమే తరువాయి చకచకా షూటింగ్ పూర్తి చేస్తూ సినిమాని జులై 28 న బ్రో ని ఆడియన్స్ ముందుకు తెచ్చెందుకు రెడీ చేసేస్తున్నారు. ప్రస్తుతం మామ-అల్లుళ్ళ పోస్టర్ తో సరిపెట్టిన మేకర్స్ అతి త్వరలోనే బ్రో టీజర్ రివీల్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం.

Mama - Allulla BRO poster is here:

Pawan Kalyan and Sai Dharam Tej’s stylish-combo look from Bro

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ