యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర షూటింగ్ మొదలు పెట్టినదగ్గర నుండి చిన్న గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే కి కొరటాల శివ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటుగా NTR30 టైటిల్ దేవరని రిలీజ్ చేసి ఫాన్స్ కి బిగ్ ట్రీట్ ఇవ్వగా.. దేవర లుక్ లో ఎన్టీఆర్ అదిరిపోయాడంటూ ఫాన్స్ సంతోషపడి సంబరాలు చేసుకున్నారు. నిన్నమొన్నటివరకు దేవర షూటింగ్ కోసం బాగా కష్టపడిన ఎన్టీఆర్ తన కొడుకులకి వేసవి సెలవలు ముగుస్తూ ఉండడంతో ఓ చిన్నపాటి ప్లాన్ చేసుకున్నాడు.
భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి చిన్నపాటి ట్రిప్ ప్లాన్ చేసుకుని గత రాత్రి ఆయన వెకేషన్స్ కి వెళ్ళిపోయాడు. నిన్న ఆదివారం తాతగారి జయంతి కావడంతో ఉదయమే NTR ఘాట్ కి వెళ్లి ఆయనకి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ రాత్రి ఆయన ఫ్యామిలీతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. భార్య పిల్లలతో చిన్న ట్రిప్ ని విదేశాల్లో ఎంజాయ్ చెయ్యాలని డిసైడ్ అయ్యి ఆయన ఫ్లైట్ ఎక్కేసాడు.
వెకేషన్స్ నుండి రాగానే దేవర షూటింగ్ లో మునిగిపోతాడు. నవంబర్ నుండి ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. వచ్చే ఏడాది మార్చి నుండి ప్రశాంత్ నీల్ NTR31లో భాగమవుతాడంటూ మేకర్స్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు.