ప్రస్తుతం త్రిష కృష్ణన్ కోలీవుడ్ లో మరోమారు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్శ్ లో అందంగా, ఆకర్షణగా, పెరఫార్మెన్స్ పరంగా అద్భుతః అనిపించి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. 96 తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలేవీ త్రిష కెరీర్ కి హెల్ప్ అవ్వకపోయినా.. మణిరత్నం గారు త్రిషకి పొన్నియన్ సెల్వన్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కించారనడంలో సందేహమే లేదు. ప్రెజెంట్ త్రిష కెరీర్ పరుగులు పెడుతుంది. పొన్నియన్ సెల్వన్ రెండో భాగం విడుదల కాకముందే స్టార్ హీరో విజయ్ LEO లో హీరోయిన్ గా సెట్ అయ్యింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు తాజాగా అజిత్ కుమార్-లైకా ప్రొడక్షన్ కలయికలో మొదలు కాబోతున్న భారీ బడ్జెట్ మూవీ విదా ముయార్చి లో త్రిషనే హీరోయిన్ గా ఎంపిక చేసారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంలో త్రిష కీ రోల్ పోషించబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అజిత్ తో త్రిష పలుమార్లు స్క్రీన్ షేర్ చేసుకుంది.
అంతేకాకుండా కమల్ హాసన్-మణిరత్నం కలయికలో తెరకెక్కబోయే చిత్రంలోనూ త్రిషనే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ప్రస్తుతం త్రిష క్రేజ్ కోలీవుడ్ లో బాగా పెరిగింది. కమల్-అజిత్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో త్రిష కృష్ణన్ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఒకలా.. ప్రమోషన్స్ లో మరోలా ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన త్రిషకి ఈ క్రేజ్ రావడం సహజమే.