Advertisementt

హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదాశర్మ

Sun 28th May 2023 05:11 PM
adah sharma  హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదాశర్మ
Adah Sharma made shocking comments on hindi heroes హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదాశర్మ
Advertisement
Ads by CJ

కేరళలోనే కాదు ఇప్పుడు ఇండియా మొత్తం మార్మోగిపోతున్న హీరోయిన్ పేరు అదాశర్మ. 200 కోట్ల క్లబ్బులో చేరిన ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీలో ఆదాశర్మ నటించడమే ఆమెని ఇంతగా పాపులర్ చేసింది. వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీలో నటించిన అదాశర్మ ఇప్పుడు క్రేజీగా మారింది. ఈ ప్లాప్ హీరోయిన్ ఇప్పుడు ఆమెని ఫేమస్ చేసిన కేరళ స్టోరీ ప్రమోషన్స్ తో మరింత హైలెట్ అవుతుంది

అయితే సక్సెస్ రాగానే అదాశర్మ తాను ఇండస్ట్రీలో ఫేస్ చేసిన కొన్ని విషయాలని డేరింగ్ గా బయటపెడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలపై అదాశర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. హిందీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు సెట్స్ కి చాలా లేట్ గా వస్తారు. కానీ హీరోయిన్స్ ముందే రావాలంటూ దర్శకులు రూల్ పెడతారు. హీరోలు వచ్చేవరకు షూటింగ్ మొదలు పెట్టరు. హీరోలు వచ్చేవరకు హీరోయిన్స్ వెయిట్ చెయ్యాలి

సినిమా షూటింగ్ సజావుగా సాగాలంటే అది డైరెక్టర్స్ యాటిట్యూడ్ పైనే ఆధాపడి ఉంటుంది.. అంటూ హిందీ హీరోలపై కామెంట్స్ చేసిన అదాశర్మ తాను ఇకపై స్క్రిప్ట్స్ ని జాగ్రత్తగా ఎంచుకుంటానని, కొత్త కథలతో సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

Adah Sharma made shocking comments on hindi heroes:

Adah Sharma comments on hindi industry

Tags:   ADAH SHARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ