ఈరోజు తాతగారు నందమూరి తారకరామారావు శతజయంతి కాడంతో తారక్ ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతగారి సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అంతకుముందే బాలకృష్ణ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళు అర్పించి వెళ్లిపోయారు. ఇక జూనియర్ ఎన్టీఆర్.. NTR ఘాట్ కి వస్తున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకి చేరుకున్నారు.
కనీసం ఎన్టీఆర్ ని తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి మనస్ఫూర్తిగా దణ్ణం కూడా పెట్టుకోనివ్వలేదు. ఆయనతో సెల్ఫీలు దిగే ఆతృతలో ప్రతి ఒక్కరూ ఫోన్ తో కనిపించారు. అంతలా అభిమానుల తోపులాట జరిగింది. అభిమానులు హడావుడితో ఎన్టీఆర్ ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంతేకాకుండా అభిమానులు రెచ్చిపోయి సీఎం, సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసారు. ఎన్టీఆర్ కూడా అభిమానుల అతి, తోపులాటలోనే తాతగారికి నివాళులర్పించి పూలు వేసి దణ్ణం పెట్టుకుని వెళ్లిపోయాడు.
ఎన్టీఆర్ అభిమానుల అతి చూసాక నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి అతి చేసి ఆయన్ని పలచన చెయ్యకండి, అభిమానులు అభిమానం వెర్రి తలలు వేస్తోంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.