నరేష్-పవిత్ర లోకేష్ జంటగా MS రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మళ్ళీ పెళ్లి మంచి ప్రమోషన్స్, భారీ అంచనాల నడుమ నిన్న శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. నరేష్ మూడు పెళ్లిళ్లు, మూడో భార్యతో తానేదో ఇబ్బందిపడినట్టుగా చూపించే ప్రయత్నంలో తనకి పవిత్ర లోకేష్ ఎలా తోడైంది.. ఆమెతో తన జీవితం ఎలా ముడిపడబోతుంది అనేది సినిమా ద్వారా చూపించారు. నరేష్ కి డబ్బుంది ఏం చేసినా చెల్లుతుంది అన్న కోణంలోనే ఈ సినిమా ఉంది. ప్రేక్షకులు అలానే ఫీలయ్యారు. మూడో భార్యని నెగెటివ్ గా చూపించడమే తన లక్ష్యమన్నట్టుగా మళ్ళీ పెళ్లి సాగింది.
అంటే నరేష్-పవిత్ర లోకేష్ ఓ ప్రెస్ మీట్ పెట్టి తమ పర్సనల్ వ్యహారాలను మీడియాకి చెప్పి పబ్లిసిటీ చేసుకోకుండా.. ఇలా ఓ సినిమా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. సినిమా కథ మొత్తం
ఆల్మోస్ట్ నరేష్-పవిత్ర లోకేష్ లకి అనుకూలంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగింది. అయితే ఈ కథ చెప్పడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా అన్న వాళ్ళు ఉన్నారు. ఈ చిత్రంలో నరేష్ ఏం చూపించారో అనే క్యూరియాసిటీతో ఉన్నవాళ్లు థియేటర్స్ కి వెళ్లారు.
ఇపుడు మళ్ళీ పెళ్లి ఏ ఓటిటిలో వస్తుందో అనే క్యూరియాసిటిలో కొంతమంది ఆడియన్స్ కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని అలా ఇంట్లో కూర్చుని చూసేయ్యొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. అందుకే ఏ ఓటిటిలో ఎప్పుడు విడుదలవుతుందో అనే ఆత్రుత చూపిస్తున్నారు. మళ్ళీ పెళ్లి అమెజాన్ ప్రైమ్ వారు మంచి డీల్ తో సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. థియేటర్స్ రెస్పాన్స్ ని బట్టి మూడు వారాల్లో ఓటిటిలోకి తేవాలా.. లేదంటే నాలుగు వారాల్లో స్ట్రీమింగ్ చెయ్యాలా అనేది మేకర్స్ ఆలోచిస్తారట.