ఐఫా మీడియా మీట్ సందర్భంగా విక్కీ కౌశల్-సల్మాన్ ఖాన్ స్టేజ్ పంచుకోవడానికి వస్తున్నప్పుడు విక్కీ కౌశల్ ని ఫొటోస్ తీస్తుండగా సల్మాన్ ఖాన్ పర్సనల్ సెక్యూరిటీ విక్కీ కౌశల్ ని పక్కకి తోసేస్తున్న సందర్భం, విక్కీ కౌశల్ మాట్లాడుతుండగా.. సల్మాన్ ఖాన్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. మీడియాలో కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ పై సల్మాన్ కి ఎందుకంత కోపం, విక్కీ కౌశల్ కూడా ఫేమస్ నటుడే కదా.. సల్మాన్ ఖాన్ సెక్యూరిటీకి ఆ మాత్రం తెలియదా, సల్మాన్ ఖాన్ మాట్లాడకుండా మరో నటుడుని ఇలా అవమానిస్తాడా అంటూ రకరకాల చర్చలు మొదలైపోయాయి.
సల్మాన్ ఖాన్ ఫాన్స్ మాత్రం మరో వీడియోని షేర్ చేసారు. ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ స్టేజ్ ఎక్కగానే విక్కీ కౌశల్ ని హాగ్ చేసుకున్న వీడియో అది. చూడండి సల్మాన్ ఖాన్ కావాలని ఏది చెయ్యరు.. పొరబాటున జరిగిన దానికి ఇంత రాద్ధాంతం అవసరమా అంటున్నారు. మరోపక్క విక్కీ కౌశల్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. చాలాసార్లు అనసర విషయాలు కూడా చాలా పెద్దవిగా కనిపిస్తాయి.
అసలు అక్కడేమి ఉండదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నట్టుగా అక్కడేమి జరగలేదు, అసలు ఈ విషయమై మాట్లాడానికి ఏమి లేదు అంతా లైట్ అన్నట్టుగా విక్కీ కౌశల్ తేల్చేసాడు.