యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతగారి శతజయంతి ఉత్సవాలకు అటెండ్ కాకపోడంతో మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిస్తే.. నందమూరి-ఎన్టీఆర్ అభిమానుల మధ్యన సోషల్ మీడియాలో రచ్చ అయ్యింది. ఎంతోమంది గుండెల్లో ఆరాధ్య దైవంగా మారిన తాతగారి వేడుకకన్నా నీకు నీ పుట్టిన రోజే ముఖ్యమైపోయిందా అంటూ ఎన్టీఆర్ ని నందమూరి అభిమానులే నానా మాటలన్నారు. అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తూ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ని గౌరవించరు. అలాంటప్పుడు ఎందుకు రావాలంటూ వాళ్ళు నందమూరి అభిమానులని ఏసుకున్నారు.
ఇక ఈ మధ్యలో ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ ని ఆహ్వానించిన ఎన్టీఆర్ శతజయంతి కమిటీ సభ్యులు జనార్దన్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తాతగారి శతజయంతి ఉత్సవాలకు ఎందుకు రాలేదో వివరించారు. ఎన్టీఆర్ ని రెండు వారాల ముందు ఇన్విటేషన్ ఇద్దామని అపాయింట్మెంట్ అడిగితే వారం ముందు ఇచ్చారు. ఆయన్ని మేము కలిసి ఆహ్వానించినప్పుడే రావటం కుదరదు అన్నారు. కుదిరితే రావాలని కోరాము. బర్త్ డే ఉంది 22 ఫామిలీస్ తో కలిసి ట్రిప్ కి వెళుతున్నామని, అది ముందే ప్లాన్ చేసిన ట్రిప్ అన్నారు. బర్త్ డే ఎప్పుడైనా వస్తుంది. తాతగారి శతజయంతి ఉత్సవాలు మళ్ళీ రావు.. కుదిరితే తప్పకుండా రమ్మని అడిగాము. ఆయనకి కుదరలేదు.. ఇందులో చర్చ ఏంలేదు.
ఎన్టీఆర్ తో పాటుగా కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు ట్రిప్ కి వెళ్ళింది. అందుకే ఆయన్ని ఆహ్యానించినా ఆయనా రాలేకపోయారు.. అంటూ జనార్దన్ ఆ ఛానల్ ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టారు.
ఇది చూసాకైనా నందమూరి-ఎన్టీఆర్ అభిమానుల ఫైట్ ఆపుతారో.. లేదంటే మరింతగా రెచ్చిపోయి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారో చూద్దాం.