మహేష్ బాబు చిన్నప్పుడు చాలా నాటీగా ఉండేవారట. ఆయన అందరి వాయిస్ లని ఇట్టే ఇమిటేట్ చేస్తూ మిమిక్రి చేసావారట. చాలా టాలెంట్ ఉన్న మహేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ గా అటు కెరీర్ లోనే కాదు ఇటు మానవత్వం ఉన్న మనిషిగా తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. రీసెంట్ గా మహేష్ బాబాయ్ ఆదిశేషగిరి రావు గారు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు కొంటెపనులని బయటపెట్టారు.
14 ఏళ్ళ వయసులోనే మహేష్ బాబు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారుని రయ్ రయ్ మని నడుపుతూ పోలీసులు వెంటబడుతున్నా వారిని తప్పించేసుకుని బాబాయ్ ఆఫీస్ వెనుకె కారు పార్క్ చేసి ఏమి తెలియనివాడిలా బాబాయ్ ఆదిశేష గిరి రావు దగ్గరకి వచ్చి కూర్చున్నారట. అప్పుడు పోలీసులు రాగా ఆది శేషగిరి గారు వారికి సర్దిచెప్పి పంపేసారట. ఈ ఘటన చెన్నై లో జరిగినట్టుగా ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరించారు.
ఇక నమ్రత పెళ్లి విషయంలో కూడా తల్లి ఇందిరగారికి చెప్పి ఆమెతో తండ్రి కృష్ణగారికి చెప్పించి ఒప్పించి నమ్రతని వివాహం చేసుకున్నట్టుగా ఆయన రివీల్ చేసారు. అందరికి నచ్చాక అన్నయ్య కృష్ణగారు కూడా ఒప్పుకుని వారి వివాహం చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.