గోవా బ్యూటీ ఇలియానా కొన్నాళ్లుగా మీడియాలో కనిపించకపోయినా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. కారణం ఇలియానా ప్రెగ్నెంట్ అవడమే. ఆమె పెళ్లి చేసుకుని భర్తని పరిచయం చేసుకుని.. ప్రెగ్నెంట్ అయితే ఎవరికీ ఏ ఆత్రుత, సమస్య ఉండేది కాదు. కానీ ఇలియానా పెళ్లి చేసుకున్నట్టుగా ఎలాంటి హింట్ ఇవ్వకుండా ప్రెగ్నెన్సీని అనౌన్స్ చెయ్యడంతో అందరిలో అనుమానాలు, క్యూరియాసిటీ ఎక్కువయ్యాయి.
కొద్దిరోజులుగా ఇలియానా ప్రెగ్నెన్సీ వార్త హాట్ హాట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈమధ్యలో బేబీ బంప్ ని పరిచయం చేస్తూ ఇలియానా రచ్చ మొదలు పెట్టింది. సినిమా కెరీర్ లో బాగా గ్యాప్ రావడం, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవడంతో మానసిక సమస్యలను ఎదుర్కున్న ఇలియానా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బాగా హైలెట్ అవుతుంది. రీసెంట్ గా బేబీ బంప్ ని చూపించిన ఇలియానా ఇప్పుడు మరోసారి బేబీ బంప్ తో రచ్చ చేస్తుంది.
కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా సహజీవనం చేస్తోంది అనే రూమర్ ఉంది. అయితే తాను గర్భవతి అనే విషయం తప్ప ఇలియానా ఇలాంటి విషయాలేమి రివీల్ చేయలేదు. ప్రస్తుతం అయితే ఇలియానా బాబు బంప్ చూపిస్తూ మిర్రర్ లో సెల్ఫీ తీసుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.