మరికొన్నిగంటల్లో మళ్ళీ పెళ్లి థియేటర్స్ లోకి విడుదల కాబోతుంది అనుకున్న సమయంలో మళ్ళీ పెళ్లి విడుదల ఆపాలంటూ హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వెయ్యడం మళ్ళీ పెళ్లి టీం ని టెన్షన్ తీసుకునేలా చేసింది. నరేష్-పవిత్ర లోకేష్ కీలక పాత్రల్లో MS రాజు తెరకెక్కించిన మళ్ళీ పెళ్లి చిత్రం తన ప్రతిష్టని భంగపరిచేదిలా ఉంది.. ఆ చిత్రం విడుదలైతే తన పరువుకు నష్టం వాటిల్లుతుంది అంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టులో పిటిషన్ వేసింది.
ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిన మళ్ళీ పెళ్లి రమ్య రఘుపతి కేసుతో విడుదల ఆగిపోతుందా? నరేష్ ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు? అసలు ఈ చిత్రం విడుదలకు నరేష్ ఏం చేస్తారు? ఇలా రాత్రంత్ర రకరకాల ఆలోచనలతో చాలామంది గడిపారు. కానీ ఇప్పుడు సమస్యని నరేష్ పరిష్కరించేసారు. మళ్ళీ పెళ్ళికి ఎలాంటి అడ్డు లేకుండా నేడు థియేటర్స్ లోకి తెచ్చేసారు.
రమ్య రఘుపతి కేసుని నరేష్ ఏం చేసారో ఏమో అనుకున్న సమయానికి మళ్ళీ పెళ్లి విడుదలకి రెడీ అయ్యింది. ప్రస్తుతం నరేష్-పవిత్రలు కూడా మళ్ళీ పెళ్లిని ప్రేక్షకులతో కలిసి చూసేందుకు RTC క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ కి వెళుతున్నారు.