జబర్దస్త్ ని వదలి పక్క ఛానల్ కి వెళ్ళినా, లేదంటే వెండితెర అవకాశాల కోసం పాకులాడినా అవి కొంతమంది కమెడియన్స్ కే వర్కౌట్ అయ్యాయి. చాలామంది కమెడియన్స్ జబర్దస్త్ ని వదిలి వెళ్ళాక కొన్ని సినిమాల్లో కనిపించి, పక్క ఛానల్స్ లో కామెడి చేసినా ప్రస్తుతం ఖాళీగా కూర్చుని గోళ్లు గిల్లుకుంటున్నారు. ఆలా అప్పట్లో ఫణి జబర్దస్త్ వదిలేస్తే కొన్నేళ్ల తర్వాత అతనికి రీ ఎంట్రీ దొరికింది. వేణు, శ్రీను, ధనరాజ్ షకలక శంకర్ లు జబర్దస్త్ ని వదిలేసి సినిమాల్లో బిజీ అయ్యారు. అందులో వేణు, ధనరాజ్ క్లిక్ అవ్వగా.. షకలక శంకర్ రీసెంట్ గా బుల్లెట్ భాస్కర్ స్కిట్ తో జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక సుధీర్, శ్రీను, ఆది జబర్దస్త్ నుండి తప్పుకోగా.. సుధీర్ హీరోగానే కాకుండా పక్క ఛానల్ కి పోయి యాంకరింగ్ కూడా చేసాడు. శ్రీను, ఆదిల సినిమాలతో బిజీ అయ్యి మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక సునామి సుధాకర్-బుల్లెట్ భాస్కర్ అంటూ జబర్దస్త్ స్టేజ్ పై స్కిట్స్ చేసే వాళ్ళిద్దరిలో సుధాకర్ లేడీ గెటప్స్ తో బాగా ఫెమస్ అయ్యాడు. తర్వాత చంటి స్కిట్ లోను చేసేవాడు. అయితే బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ లోనే ఉండిపోయాడు. కానీ సుధాకర్ జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా.. తర్వాత అతనెక్కడా కనిపించలేదు. తాజాగా సుధాకర్ జబర్దస్త్ లోకి నూకరాజు స్కిట్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు.
మొన్న వారం బుల్లెట్ భాస్కర్ స్కిట్ తో షకలక శంకర్ రీ ఎంట్రీ ఇస్తే.. ఈ వారం సుధాకర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ గ్యాప్ లో కనీసం యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టుకుపోయావా అన్నా అని అడిగి అతన్ని సరదాగా ఆటపట్టించారు నూకారాజు టీం సభ్యులు. పంచ్ ప్రసాద్ సుధాకర్ ని మరిచిపోయామంటూ వేసిన జోక్ బాగా పేలింది. ఒకప్పుడు జబర్దస్త్ లో ఫెమస్ అయ్యి బయటికి వెళ్లి ఇతర ఛానల్స్ లో నిలదొక్కుకోవాలని చూసి కొంతమంది సెటిల్ అవ్వగా.. మరికొంతమంది మాత్రం అక్కడ నిలబడలేక మళ్ళీ జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం దారులు వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు.