ఇప్పుడు స్టార్ హీరోల ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ఫాన్స్ ని తెగ ఇంప్రెస్స్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ బ్రో, అల్లు అర్జున్ పుష్ప లుక్, మహేష్ బాబు SSMB28 లుక్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర లుక్స్ రిలీజ్ అయ్యి ఆయా హీరోల ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసాయి. ఆ ఫస్ట్ లుక్స్ ని ట్రెండ్ చేస్తూ రికార్డ్ వ్యూస్ తో సోషల్ మీడియాలో అభిమానుల సందడి అంతా ఇంతా కాదు.
అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, మహేష్ బాబు SSMB28, అల్లు అర్జున్ పుష్ప, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ల లుక్ తో దేవర లుక్ పై సోషల్ మీడియా వేదికగా పోల్ పెట్టగా.. ఎక్కువగా ఎన్టీఆర్ దేవర లుక్ కే ప్రేక్షకులు ఓటేస్తున్నారు. ఎవరు ఏ పోల్ పెట్టినా అందులో దేవరకే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. సముద్రపు అలల మధ్యన ఉగ్రుడిగా ఎన్టీఆర్ లుక్ ఫాన్స్ కే కాదు మాస్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చేసింది అనేది సోషల్ మీడియా పోల్స్ చూస్తే తెలిసిపోతుంది.
ఎక్కువ శాతం దేవరకే లైక్స్, షేర్స్ కొట్టడంతో ఇప్పుడు చరణ్ గేమ్ ఛేంజర్, మహేష్ లుక్, పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్స్ కన్నా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కే ఎక్కువ హైప్ వచ్చింది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఏ లుక్ ఆడియన్స్ కి నచ్చిందో అనేది ఆయా సినిమాల రిజల్ట్ ని బట్టి డిసైడ్ అవుతుంది. అంతేగా మరి.. సినిమా హిట్ అయితే ఆ లుక్ కూడా హిట్ అవుతుంది. కాకపోతే అభిమానులు మాత్రం ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకు పొంగిపోతారు అంతే.