ఈమధ్యన ట్రెడిషనల్ లుక్ నుండి గ్లామర్ లుక్ కి చేంజ్ అయ్యి అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవల్ చూపిస్తున్న యాంకర్ శ్రీముఖి అంతే స్పీడుగా బరువు కూడా తగ్గింది. ఇప్పటికీ తనకి పదహారేళ్లే అన్న రేంజ్ లో శ్రీముఖి చిన్న పిల్లలా తయారవుతుంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి మరీ అందాలు ఆరబోస్తున్న శ్రీముఖి రీసెంట్ గా బర్త్ డే మంత్ అంటూ బ్యాంకాక్ అందాలని ఆస్వాదించి వచ్చింది. థాయిలాండ్ బీచ్ బ్యాంకాక్ అందాలను తాను చూడడమే కాదు.. ఆ అందాలతో తాను కూడా పిక్స్ దిగి సోషల్ మీడియాలో పంచుకుంది.
చిన్న చిన్న గౌన్స్ వేసుకుని, గ్లామర్ అవుట్ ఫిట్స్ తో అదరగొట్టేసింది శ్రీముఖి నేడు సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. లైట్ కలర్ లెహంగాలో శ్రీముఖి మెరిసిపోయింది. మెడలో చోకర్ తో చేతినిండా రాళ్ల గాజులతో బేబీ పింక్ అవుట్ ఫిట్ లో శ్రీముఖి అందాలు ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. హెయిర్ లూజ్ గా వదలకుండా క్లిప్ పెట్టి మరీ ఫొటోలకి ఫోజులిచ్చింది.
ప్రస్తుతం బుల్లితెర మీద క్రేజీ యాంకర్ గా అన్ని ఛానల్స్ ని చుట్టేస్తున్న శ్రీముఖి అటు సిల్వర్ స్క్రీన్ పై కుడా అవకాశాలు అందుకుంటుంది.