ఇప్పుడు ఎక్కడ చూసినా మలయాళ సూపర్ హిట్ 2018 ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో బన్నీ వాస్ నిర్మాతగా డబ్ చేసి ముందుగానే ప్రెస్ ప్రీమియర్స్, సెలెబ్రిటీ ప్రీమియర్స్ అంటూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. నాగ చైతన్య లాంటి సెలబ్రిటీస్ 2018 సినిమా చూసి సూపర్ మూవీ అంటూ ట్వీట్స్ చెయ్యడంతో అందరిలో సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది.
రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తెలుగు క్రిటిక్స్ కూడా సూపర్ హిట్ రివ్యూస్ ఇస్తూ 3 రేటింగ్స్ తో సోషల్ మీడియాలో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేశారు. ఇప్పటికే ప్రెస్ షోస్ పూర్తి కావడంతో తెలుగు నుండి యునానమస్ గా హిట్ రివ్యూస్ ఈ చిత్రానికి పడిపోయాయి. టోవినో థామస్ ప్రధాన పాత్రలో కేరళలో 2018లో వచ్చిన అకాల వర్షాలతో విపత్తు రాగా అక్కడి ప్రజలు ఎంతగా అతలాకుతలం అయ్యారో అనేది 2018 మూవీ నేపథ్యం.
సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఆయా పాత్రలకి ప్రాణం పోశారు. నేపధ్య సంగీతమైతే సినిమాని మరో ఎత్తు ఎక్కించింది. సినిమాటోగ్రఫీ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని సహజంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. కంటెంట్ పరం, సాంకేతికంగా సినిమా బావుండడంతో.. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అలాగే ఈ చిత్రానికి హిట్ రివ్యూస్ కూడా మంచి హెల్ప్ అయ్యేలా ఉన్నాయి.