నరేష్-పవిత్ర లోకేష్ కీలకపాత్రల్లో ఎంఎస్ రాజు తెరకెక్కించిన మళ్ళీ పెళ్లి క్రేజీ ప్రమోషన్స్ తో రేపు శుక్రవారం ప్రేక్షకులముందుకు రాబోతుంది. మళ్ళీ పెళ్లి చిత్రం ఆల్మోస్ట్ నరేష్-పవిత్రల పర్సనల్ లైఫ్ మీదే డిపెండ్ అయినట్లుగా ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. నరేష్-పవిత్ర బెంగుళూరు హోటల్ లో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి దొరికినప్పుడు నరేష్ ఎలా విజిల్స్ వేస్తూ ఆమెని రెచ్చగొట్టారో.. ఆయన మూడు పెళ్లిళ్లు ఇలాంటి సన్నివేశాలు అన్నీ మళ్ళీ పెళ్ళిలో కనిపిస్తున్నాయి.
మళ్ళీ పెళ్లి ప్రమోషన్స్ లో నరేష్-పవిత్ర పబ్లిక్ రొమాన్స్, ఆమెని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం అన్నీ హైలెట్ అయ్యాయి. అయితే రేపు తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కాబోయే ఈ చిత్రాన్ని ఆపాలంటూ నరేష్ మూడో భార్య హై కోర్టుని ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. మళ్ళీ పెళ్లి చిత్రం తన ప్రతిష్టని కించపరిచేదిలా ఉంది అంటూ, ఈ సినిమా విడుదల ఆపాలంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆశ్రయించింది.
మరి కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు ఇచ్చే తీర్పుని బట్టి రేపు మళ్ళీ పెళ్లి విడుదలవుతుందా, లేదా.. అనేది తెలుస్తుంది. ప్రస్తుతమైతే మళ్ళీ పెళ్లి విడుదల విషయం సస్పెన్స్ గా మారింది.