టాలీవుడ్ దర్శకులంతా ప్యాన్ ఇండియా ఫిలిమ్స్ అంటూ వెంటబడుతుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం కూల్ గా ఇక్కడి ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ తోనూ జస్ట్ తెలుగు రాష్ట్రాలకి పరిమితమయ్యే కథతోనే సినిమా చేస్తున్నారు తప్ప.. ప్యాన్ ఇండియా కథ ఎంచుకుని పలు భాషల్లో సినిమా చేసే ఆలోచన చెయ్యలేదు. అసలు ఎలాంటి అనుభవం లేని వారు కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ టైటిల్ లోనే రివీల్ చేస్తున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ప్యాన్ ఇండియాపై మోజు పడడం లేదు.
అయితే తాజాగా త్రివిక్రమ్ మొదటి ప్యాన్ ఇండియా ఫిల్మ్ అల్లు అర్జున్ తోనే అంటూ బాలీవుడ్ మీడియాలో ఎక్స్ క్లూజివ్ న్యూస్ లు వెలువడుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మొదటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో చెయ్యబోతున్నాడు. పుష్ప తో ప్యాన్ ఇండియా మ్యాజిక్ చేసిన అల్లు అర్జున్ తదుపరి మూవీ ని సందీప్ వంగాతో ప్రకటించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది అనే ప్రచారం ఉంది.
ఇప్పుడు అదే కాంబోలో త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారంటూ ఆ న్యూస్ విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మరి మహేష్ తో చేస్తున్న SSMB28 వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేసి తర్వాత ఆయన ప్యాన్ ఇండియా కథ మీదే కూర్చుంటారట. త్రివిక్రమ్-బన్నీ చిత్రం 2024 లో సెట్స్ మీదకి వెళుతుంది అంటున్నారు. అల్లు అర్జున్ తో తన మొదటి ప్యాన్ ఇండియా మూవీని బ్లాక్ బస్టర్ వైపు నడిపించేలా ఆయన భావిస్తున్నట్లుగా ఆ కథనాల సారాంశం.