ఈ నెలలో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా బాక్సాఫీసు చూడలేదు. మే 5 న వచ్చిన ఉగ్రం, రామబాణం సినిమాల్లో ఉగ్రం పర్వాలేదనిపించింది.. రామబాణం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత వారం మే 12 న భారీ అంచనాలు నడుమ విడుదలైన చైతన్య కస్టడీ ఆకట్టుకోలేకపోయింది. డబ్బింగ్ మూవీ ఫర్హానా బావుంది అన్నారు. ఇక మే 18 న ప్రేక్షకులముందుకు వచ్చిన అన్ని మంచి శకునములే నిరాశపరచసాగా డబ్బింగ్ మూవీ బిచ్చగాడు 2 కి మాత్రం మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అవడం.. తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో వారానికే బ్రేక్ ఈవెన్ సాధించేసింది.
ఇక ఈ శుక్రవారం బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాలు ఫైట్ కి దిగుతున్నాయి. మేమ్ ఫెమస్, మళ్ళీ పెళ్లి, మెన్ టూ ఈ మూడు సినిమాలు క్రేజీగా కనిపిస్తున్నాయి. జైత్ర ఇంకా డబ్బింగ్ మూవీస్ విడుదలవుతున్నా ఇప్పుడు అందరి కళ్ళు నరేష్-పవిత్రల మళ్ళీ పెళ్లి, మేమ్ ఫెమస్, మెన్ టూ లపైనే ఉన్నాయి. మూడు సినిమాలు ప్రమోషన్స్ పరంగాను కొత్తగా ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి.
నరేష్-పవిత్రలైతే మళ్ళీ పెళ్లి సినిమాపై క్రేజ్ తేవడానికి యూత్ లా రెచ్చిపోయి డాన్స్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా చూస్తే నరేష్ లైఫ్ పై ఓ క్లారిటీ వస్తుంది అనుకునేలా ప్రేక్షకుల్లోకి మళ్ళీ పెళ్లి వెళ్ళింది. ఇక మేమ్ ఫెమస్ హీరో కొత్త హీరో కావడం.. ప్రమోషన్స్ పరంగా కొత్త కొత్తగా ఆలోచించడం, మహేష్ బాబు కూడా మేమ్ ఫెమస్ బావుంది అంటూ ట్వీట్ చెయ్యడం వంటి విషయాలతో క్రేజీగా కనిపిస్తుంది.
మరి రేపు శుక్రవారం విడుదల కాబోయే ఈమూడు సినిమాల్లో ఏది హిట్ అవుతుంది.. ఏ సినిమా ఆడియన్స్ కి రీచ్ అవుతుందో అని ఇప్పుడు చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.