నందమూరి అభిమానుల వలన నందమూరి హీరోలు చులకనైపోతున్నారు. హీరోల మధ్యన ఉన్న ఈగోల వలన నందమూరి అభిమానులు నలిగిపోవడమే కాదు.. ఇప్పుడు కొట్లాటకు దిగడం అత్యంత బాధాకరమైన విషయం. ఫ్యామిలిలో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. కానీ ఫ్యామిలీ గొడవలు పబ్లిక్ లో చూపిస్తే ఎంత దారుణంగా ఉంటుందో సోషల్ మీడియా చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం నందమూరి vs ఎన్టీఆర్ ఫాన్స్ గొడవ తారాస్థాయికి చేరింది.
ఇదంతా తారక్ సీనియర్ ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలకు హాజరు కాకపోవడమే. నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పై విరుచుకుపడుతున్నారు. పెదనాన్న రామకృష్ణ పిలిస్తే తాతగారి ఈవెంట్ కి రావా.. అంటూ నానా యాగీ చేస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. బాలయ్యకి ఇష్టం లేకుండా ఎన్టీఆర్ స్టేజ్ పైకి ఎందుకొస్తాడు. కళ్యాణ్ రామ్ అంటే ప్రేమ చూపించే బాలకృష్ణ గారు ఎన్టీఆర్ తో కలిసిపోయాడని కళ్యాణ్ రామ్ ని దూరం పెడతారా అదేనా మీరు అన్న కొడుకులకిచ్చే గౌరవం అంటూ తిట్టిపోస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా..
కావాలని జూనియర్ బర్త్ డే రోజున, సీనియర్ వేడుకలు చేశారు..
జస్ట్ 4 days ముందు invitation ఇచ్చారు.
Function చేయాల్సింది సీనియర్ birthday రోజున కదా..🙏
విజయవాడ లో చేసిన ఫంక్షన్ కి invitation లేదు 🙏
నెక్స్ట్ 28 న రాజమండ్రీ లో చేసే మహానాడు కి invitation లేదు. 🙏 అంటూ ట్వీట్ చెయ్యగా.. దానికి నందనమూరి అభిమానులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
28 mahanadu పెట్టుకొని ఎలా చేస్తారు మహ నాడు కి 🎥 వాళ్ళు మొన్న వచ్చినట్టు వస్తారా ఏమి లాజిక్ లేని బుర్ర.
కావాలని జూనియర్ బర్త్ డే రోజున సీనియర్ బర్త్ డే చేశారానటం పద్ధతి కాదు బ్రో.
Sir స్వయంగా తాతయ్య ఫంక్షన్ కి ఎప్పుడు చెప్తే ఏంటి సార్ తాత పై అభిమానం ప్రేమ ఉంటే ఎవరికోసం కాకపోయినా ఆయన కోసమే సరే వచ్చి ఉండాల్సింది
కొన్ని వ్యక్తిగత మనస్పర్ధలు ఉండి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ గారిపై ప్రేమతో వచ్చి ఉంటే బాగుండేది అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ వార్ చేసుకుంటున్నారు.
నందమూరి-ఎన్టీఆర్ అభిమానుల కొట్లాట ఇప్పుడు నందమూరి హీరోల ప్రతిష్ట దిగజారుస్తుంది. బాలకృష్ణ-కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ ఇలా ఒకే వేదికపై కనిపిస్తే పండగ చేసుకునే ఫాన్స్.. ఒక్కసారి.. ఒక్క ఈవెంట్ లో.. ఒక్కరు మిస్ అయినా అది జీర్ణించుకోలేరు. దానికి ఫలితమే ఈ సోషల్ మీడియా వార్.