పవన్ కళ్యాణ్ రీమేక్స్ తో వరసగా హిట్స్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్స్ ని పవన్ కళ్యాణ్ కి సజెస్ట్ చేసింది ఆయన ఫ్రెండ్ త్రివిక్రమ్. ఆయన ఉంటే సినిమా హిట్ పక్కా అనేది ప్రతి తెలుగు ప్రేక్షకుడికి తెలిసిన సత్యమే. వకీల్ సాబ్ తో వేణు శ్రీరామ్, భీమ్లా నాయక్ తో సాగర్ కే చంద్ర ఇద్దరూ డమ్మీలే. మొత్తం త్రివిక్రమ్ చూసుకున్నారు.
కాబట్టే అవి హిట్ అయ్యాయి అనేది పవన్ ఫాన్స్ నమ్ముతున్నారు. అటు రీమేక్స్ అయితే పవన్ కూడా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు. తాజాగా సముద్రఖని చిత్రానికి కూడా బ్యాక్ బోన్ గా త్రివిక్రమ్ ఉన్నారనే విషయాన్ని పదే పదే మేకర్స్ రివీల్ చేస్తున్నారు. లేదంటే తమిళ రీమేక్ బ్రో కి హైప్ రాదని అందుకే త్రివిక్రమ్ ని ఇలా హైలెట్ చేస్తున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ తో డైరెక్ట్ గా సినిమా చెయ్యని త్రివిక్రమ్ ఇలా ఆయన రీమేక్స్ వెనుక షాడోలా నిలబడుతున్నారు.
పవన్ కళ్యాణ్ 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నా.. ఆయన పాత్ర నిడివి తక్కువే ఉంటుంది. సాయి తేజ్ హీరో గనక.. ఈ సినిమాకి భారీగా క్రేజ్, హైప్ తీసుకురావాలంటే త్రివిక్రమ్ ఉండాల్సిందే. అందుకే సముద్రఖని దర్శకత్వంలో పవన్ బ్రో టైటిల్స్ లో త్రివిక్రమ్ పేరు అంతలా హైలెట్ అవుతుంది. అప్పుడే ప్రేక్షకుల్లో త్రివిక్రమ్ మార్క్ పై గురి కలిగి ఓపెనింగ్స్ బావుంటాయి. పవన్ కి త్రివిక్రమ్ చెప్పబట్టే ఈ రీమేక్స్ ఒప్పుకుంటున్నారు. లేదంటే.. లేదు. అలా త్రివిక్రమ్ పేరు హైలెట్ అవడంలో ఎంతమాత్రమూ తప్పు లేదులే.