మహేష్ బాబు SSMB28 షూటింగ్ పక్కనబెట్టి దాదాపు నెలన్నరపైనే అవుతుంది. ఈ రెండు నెలల్లో మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్స్ అంటూ వెళ్లిపోవడంతో త్రివిక్రమ్ కూడా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జూన్ 7 నుండి హైదరాబాద్ లోనే SSMB28 కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. అయితే సమ్మర్ సెలవలని ఫ్యామిలీ తో ఎంజాయ్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో SSMB28 షూటింగ్ నుండి విరామం తీసుకున్న మహేష్ దాని కొత్త షెడ్యూల్ మొదలు పెట్టకుండా ఓ యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లడం విమర్శలకి తావిస్తుంది.
ముంబైలో తన కూతురు సితారపై ఓ యాడ్ షూట్ చేయించడానికి రెండు రోజుల క్రితమే మహేష్ ముంబై వెళ్లారు. అంతేకాని మహేష్ ప్రత్యేకంగా యాడ్ షూట్ లో పాల్గొనేందుకు ముంబైగా వెళ్ళలేదు. రెండురోజుల పాటు ముంబైలో జరిగిన ఆ యాడ్ షూట్ నిన్నటితో పూర్తయ్యింది. మే 31 న మహేష్ - త్రివిక్రమ్ కాంబో SSMB28 టైటిల్ వచ్చాక జూన్ 7 నుండి సెట్స్ లోకి వెళతారు మహేష్.
అప్పటికి హీరోయిన్, మిగతా కీలక నటుల్ని త్రివిక్రమ్ అందుబాటులోకి తెచ్చేస్తారట. మహేష్ బాబు-సీనియర్ హీరో జగపతి బాబు మధ్యన ఇంట్రెస్టింగ్ సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్ లోనే ఉండబోతుంది అని తెలుస్తుంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.