తెలుగు సినిమా ప్రేక్షకులు ఉత్తములు, ఉదార స్వభావులు అని పరభాషా నటులంతా స్టేజెక్కి మైక్ పట్టుకుని ప్రశంసించేస్తుంటే వినడానికి బాగానే ఉంటుంది. నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా ఇతర భాషా నటీనటులు, దర్శకులు, నిర్మాతలు మన తెలుగు ప్రేక్షకులపై చూపించే నమ్మకం నూటికి నూరు శాతం నిజమే అని నిరూపించింది బిచ్చగాడు 2 రిజల్ట్.
ఈమధ్య కాలంలో సీక్వెన్స్ పట్ల అమితాసక్తిని చూపిస్తూ కంటెంట్ కాస్త అటు ఇటుగా ఉన్నా కనికరించేస్తూ కాసులు కురిపించేస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులు. దానికి నిదర్శనమే KGF 2 నుంచి కార్తికేయ 2, హిట్ 2, దృశ్యం 2, బిచ్చగాడు 2 వరకు వచ్చింది. బిచ్చగాడు ఫస్ట్ పార్ట్ గైన్ చేసిన గుడ్ విల్ బిచ్చగాడు 2 కి ఎంత యాడ్ అయ్యింది అంటే రివ్యూలు, రేటింగ్ లు పట్టించుకోకుండా జనాలు థియేటర్స్ కి వెళ్లేంత.. బిచ్చగాడు నచ్చకున్నా సరే ఫస్ట్ వీకెండ్ లోనే తెలుగు నాట ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిపోయేంత!
ఇప్పుడంటే ఈ ట్రెండ్ బాక్సాఫీసుపై గట్టిగా ప్రభావం చూపుతుంది, మరి అప్పట్లో కూడా ఇలాగే ఉంటే అల్లు అర్జున్ ఆర్య 2, చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా గట్టెక్కేసేవేమో.. మరిప్పుడున్న ఈ ట్రెండ్ ప్రకారం రాబోతున్న చంద్రముఖి 2, ఇండియన్ 2, డీజే టిల్లు 2, డబల్ ఇస్మార్ట్ సినిమాల పట్ల కూడా ప్రేక్షకులు ఇదే రేంజ్ క్రేజ్ చూపిస్తారా? ఇంతే రేంజ్ లో బాక్సాఫీసుకి కలెక్షన్స్ ఇస్తారా?