Advertisementt

శరత్ బాబు అంత్యక్రియలు పూర్తి

Tue 23rd May 2023 02:12 PM
actor sarath babu  శరత్ బాబు అంత్యక్రియలు పూర్తి
Sarath Babu last rites will be held shortly శరత్ బాబు అంత్యక్రియలు పూర్తి
Advertisement
Ads by CJ

నటుడు శరత్ బాబు నిన్న హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో కన్ను మూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో హైదరాబాద్ AIG లో గత నెలరోజులుగా చికిత్స పొందుతున్న శరత్ బాబు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో నిన్న సోమవారం మధ్యాన్నం కన్ను మూసారు. ఆసుపత్రి నుండి ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో దాదాపు రెండు గంటలపాటు ఉంచిన కుటుంభ సభ్యులు తర్వాత అంబులెన్స్ లో చెన్నైలోని ఆయన నివాసానికి తరలించారు.

ఈరోజు ఉదయమే చెన్నై చేరుకున్న శరత్ బాబు భౌతిక కాయాన్ని కోలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. సూపర్ స్టార్ రజినీకాంత్, సుహాసిని, సూర్య ఇలా కోలీవుడ్ ప్రముఖులు ఆయనకి నివాళులర్పించారు. చెన్నైలోని ఆయన స్వగృహంలోనే శరత్ బాబు భౌతిక కాయాన్ని ఉంచిన కుటుంభ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్యన శరత్ బాబు అంత్యక్రియలు పూర్తి చేసారు. 

Sarath Babu last rites will be held shortly:

Actor Sarath Babu Last Rites in Chennai

Tags:   ACTOR SARATH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ