యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 తో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హ్రితిక్ రోషన్ తో ఎన్టీఆర్ వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ తో కనిపిస్తాడనే ప్రచారంతో పాటుగా.. ఈ చిత్రానికి ఎన్టీఆర్ 30 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ క్రేజీ చిత్రం నవంబర్ నుండి పట్టాలెక్కబోతుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా యుద్దభూమి అంటూ హ్రితిక్ చేసిన ట్వీట్, దానికి ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లైస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఎన్టీఆర్-హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనే భయంలో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ భీకర నటన ముందు అవన్నీ.. ఎవరూ పట్టించుకోరంటూ వారే సమాధానపడుతున్నారు. ఇప్పటికే వార్ 2 స్క్రిప్ట్ లాక్ చేయడం అయిపోయింది. కానీ హీరోల డేట్లు ఫైనల్ చేసుకోవాల్సి ఉంది. జనవరి నుంచి ఎన్టీఆర్ కూడా ఎక్కువ శాతం డేట్లు అయాన్ కి ఇచ్చేస్తాడట. ఈలోపు కొరటాల దేవర షూటింగ్ ఎన్టీఆర్ కంప్లీట్ చేస్తాడు. అప్పటికి ప్రశాంత్ నీల్ ఫ్రీ అవుతాడు కాబట్టి మార్చి నుంచి NTR31 మొదలవుతుంది.
అసలు ఇంకా వార్ 2 కథనరంగంలోకి వెళ్లకుండానే విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. 2025 జనవరి 24 న వార్ 2 రిలీజ్ చేయాలని యష్ రాజ్ ఫిలింస్ భావిస్తోందట. వారు ఖచ్చితంగా డేట్ ఇచ్చారంటే.. దానికే ఫిక్స్ అవుతారు. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ లో దేవర రిలీజ్ చేస్తే.. 2025 జనవరిలో వార్ 2.. అదే ఏడాది ప్రశాంత్ నీల్ మూవీని కూడా ఎన్టీఆర్ రిలీజ్ చేసేస్తాడన్నమాట.